Just TelanganaLatest News

Metro-RTC Common Pass : మెట్రో ఆర్టీసీ కామన్ పాస్ షాక్..ధరలు తగ్గించే యోచనలో సర్కార్..

Metro-RTC Common Pass : 6,000తో పూర్తయ్యే జర్నీకి, కామన్ పాస్ పేరుతో రూ. 8,500 గుంజడం ఏ రకంగా న్యాయమని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు.

Metro-RTC Common Pass

హైదరాబాద్ సిటీలో బస్సు లేదా మెట్రో ట్రైన్ మారే ప్రయాణీకులకు ఒకే ఒక్క పాస్‌తో జర్నీని ఈజీ చేయాలనే మంచి ఆలోచనతో తీసుకొచ్చిన కామన్ పాస్(Metro-RTC Common Pass) స్కీమ్.. అసలుకే ఎసరు తెచ్చే పరిస్థితికి చేరింది. గ్రేటర్ ప్రజల ట్రావెలింగ్ కష్టాలు తీరుస్తుందని ఆశపడ్డ ఈ పాస్, ప్రయాణీకుల జేబులకు చిల్లులు పొడిచేలా ఉండటంతో జనాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో ఎంతో ఆర్భాటంగా ఇంట్రడ్యూస్ చేసిన ఈ విధానంలో డైలీ పాస్ రూ. 400, ఇక మంత్లీ పాస్‌కు ఏకంగా రూ. 8,500 ధర ఫిక్స్ చేయడంతో నగరవాసులు ఫైర్ అవుతున్నారు. కనెక్టెడ్ జర్నీ ఈజీ అవుతుందని ఎదురుచూసిన ప్రయాణీకులకు ఈ ఊహించని రేట్లు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేయడంతో, ప్రభుత్వం ఇప్పుడు ఈ డెసిషన్‌పై పునరాలోచనలో పడింది.

ముఖ్యంగా డైలీ అప్ అండ్ డౌన్ చేసే ఐటీ ఎంప్లాయిస్, రెగ్యులర్ ప్రయాణీకులు ఈ పాస్ లెక్కలు చూసి షాక్ అవుతున్నారు. ఈ నెలవారీ కామన్ పాస్(Metro-RTC Common Pass) రేటు రూ. 8,500లో మెట్రో వాటా రూ. 7,000 కాగా, ఆర్‌టీసీ వాటా రూ. 1,500 అవుతుంది.

కానీ ప్రాక్టికల్‌గా కనుక ఈ లెక్కలు వేస్తే.. ఒక వ్యక్తి రోజూ మెట్రోలో మ్యాక్సిమమ్ తిరిగినా మంత్‌కు రూ. 4,200 మాత్రమే అవుతుంది. దానికి తోడు ఆర్‌టీసీ ఆర్డినరీ బస్ పాస్ కూడా రూ. 1,850కే లభిస్తుంది. అంటే విడివిడిగా తీసుకున్నా నెలకు సుమారు రూ. 6,000తో పూర్తయ్యే జర్నీకి, కామన్ పాస్ పేరుతో రూ. 8,500 గుంజడం ఏ రకంగా న్యాయమని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు. ఇది జర్నీని ఈజీ చేయడం కాదని, సామాన్యుల నుంచి దండిగా వసూలు చేయడమేనని మండిపడుతున్నారు.

Metro-RTC Common Pass
Mee Ticket AMetro-RTC Common PassPP

దీనికి తోడు ఈ కామన్ పాస్ ప్లాన్‌లో స్టూడెంట్స్, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఎలాంటి స్పెషల్ డిస్కౌంట్లు కానీ మినహాయింపులు కానీ ఇవ్వకపోవడంపై విమర్శలు మరింతగా వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఆర్టీసీలో ఈ వర్గాలకు ఇచ్చే డిస్కౌంట్‌లను ఇక్కడ పూర్తిగా పక్కన పెట్టేయడంపై మరీ ఎక్కువగా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

దీంతో ఈ పరిస్థితులన్నింటినీ గమనించి కామన్ పాస్ రేటును కనీసం రూ. 5,000 నుంచి రూ. 6,000 పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్లు బాగా పెరిగిపోయాయి. ప్రజల నుంచి వచ్చిన ఈ ఊహించని నెగిటివ్ రెస్పాన్స్‌తో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ ప్రయాణీకుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే కామన్ పాస్(Metro-RTC Common Pass) ధరల్లో సవరణలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Metro Rail : విశాఖ,విజయవాడలో మెట్రో పరుగులకు ప్లాన్ ఫిక్స్..రూ.21,616 కోట్లతో మారబోతున్న 2 సిటీల ఫేట్..

Related Articles

Back to top button