Modi : బంగారం కొనొద్దు..ప్రధాని మోదీ సంచలన పిలుపు
Modi : ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేద్దాం.. సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ కీలక పిలుపు!
Modi
తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపు సంచలనంగా మారింది. బంగారాన్ని కొనొద్దని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. పండుగలు, శుభకార్యాలు ఉన్నా సరే బంగారం కొనే విషయంలో విజ్ఞతతో వ్యవహరించాలన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయన్న మోదీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
బంగారం దిగుమతులు తగ్గితే విదేశీమారక ద్రవ్యం పెరుగుతుందన్నారు. హైదరాబాద్ పర్యటనలో బిజీబిజీగా గడిపిన మోదీ(Modi) ముందు హెచ్ ఐసీసీలో రూ.9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ను ప్రారంభించిన మోదీ ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికెళ్లిన మోదీ(Modi) అక్కడ నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రపంచమంతా సంక్షోభంలో ఉందన్న ప్రధాని మోదీ ఈ కష్ట సమయంలో దేశమంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రజలు త్యాగాలకు సిద్ధం కావాలని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా ధరలు అమాంతం పెరిగాయనీ, వీటి భారం పడకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
నష్టాన్ని కేంద్రమే భరిస్తోందని , ధరలు పెంచడం లేదనీ, ప్రజలపై భారం వేయడం లేదన్నారు. పెట్రోల్, డీజిల్ ను పరిమితంగా వినియోగించాలని సూచించిన మోదీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో వీలైనంతగా ప్రజా రవాణాను వినియోగించుకోవాలని, మెట్రోలో ప్రయాణం చేయాలని మోదీ కీలక సూచన చేశారు.

ఎరువులు, రసాయన పురుగు మందుల వాడకం తగ్గించి రైతులు సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా మోదీ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. కరోనా సమయంలో వచ్చినట్టుగా దేశంలో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
అంతే కాకుండా మరో ఏడాది వరకు విదేశీ ప్రయాణాలు పెట్టుకోవద్దని ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే బెంగాల్ లో భారీ విజయం సాధించామనీ, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Lucknow Super Giants : చెన్నై చెడుగుడు..ఐపీఎల్ నుంచి లక్నో ఔట్





