Prisoner : ఖైదీగా ఒక రోజు గడిపి చూస్తారా? మ్యూజియంతో పాటు ఆ జీవితాన్ని రుచి చూసే అవకాశం..
Prisoner : జైలులోకి ప్రవేశించిన వారికి ఒక జత ఖాదీ బట్టలు, స్టీల్ ప్లేట్, మగ్గు, పరుపు , వ్యక్తిగత వస్తువులను దాచుకోవడం కోసం లాకర్ సదుపాయాన్ని కల్పిస్తారు.
Prisoner
హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న చంచల్‌గూడ కేంద్ర కారాగారం ఇప్పుడు కేవలం నేరస్తులను ఉంచే ప్లేస్ మాత్రమే కాదు.. సాధారణ ప్రజలకు కూడా క్రమశిక్షణను నేర్పే ఒక వినూత్న అనుభవ పాఠశాలగా మారింది.
నిజాం కాలపు చారిత్రక బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈ జైలును పర్యాటక ఆకర్షణగా మారుస్తూ, తెలంగాణ జైళ్ల శాఖ ఫీల్ ది జైల్ అనే కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకూ సంగారెడ్డిలో ఉన్న ఈ మ్యూజియాన్ని ఇప్పుడు చంచల్‌గూడకు తరలించి, మరింత లేటెస్ట్‌గా తీర్చిదిద్దారు. ఈ కొత్త మ్యూజియాన్ని తాజాగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు.
ఈ డిజిటల్ యుగంలో మొబైల్, సోషల్ మీడియాకు బానిసలైన వారికి ఈ జైలు అనుభవం ఒక చక్కని డిజిటల్ డిటాక్స్ లాగా పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చే సందర్శకులు గ్యాడ్జెట్ల వరల్డ్ నుంచి దూరంగా, పూర్తి ఏకాంతంగా గడుపుతూ తమను తాము సమీక్షించుకునే ఛాన్స్ కలుగుతుంది.
ఇక్కడ పర్యాటకులు కేవలం సందర్శకులుగా మాత్రమే కాకుండా, ఖైదీ(Prisoner)లు ధరించే తెల్లటి ఖాదీ దుస్తులు ధరించి, వారు తినే సాధారణ భోజనాన్ని రుచి చూస్తూ ఒక ఖైదీ(Prisoner) జీవితాన్ని డైరెక్టుగా అనుభవించవచ్చు.
ఈ కార్యక్రమంలో భాగంగా జైలులోకి ప్రవేశించిన వారికి ఒక జత ఖాదీ బట్టలు, స్టీల్ ప్లేట్, మగ్గు, పరుపు , వ్యక్తిగత వస్తువులను దాచుకోవడం కోసం లాకర్ సదుపాయాన్ని కల్పిస్తారు. ఉదయం 6 గంటలకు నిద్రలేవడం నుంచి రాత్రి 9 గంటలకు నిద్రపోయే వరకు కూడా ప్రతీ పని ఒక క్రమశిక్షణతో కూడిన టైమ్ టేబుల్ ప్రకారమే జరుగుతుంది.

ఉదయం పూట బ్యారక్ క్లీన్ చేయడం, జైలు మెనూ ప్రకారం అల్పాహారం తీసుకోవడం , పది గంటల నుంచి తోటపని, క్లీనింగ్ వంటి పనులు చేయడం వంటివి దీనిలో భాగంగా ఉంటాయి. మ్యూజియం విభాగంలో నిజాం కాలం నాటి ఆయుధాలు, బేడీలు, పాత రికార్డులతో పాటు ప్రపంచంలోని ప్రసిద్ధ జైళ్ల ఫోటోలను కూడా చూడొచ్చు. అంతేకాకుండా, ఖైదీలు స్వయంగా తయారు చేసిన సబ్బులు,షాంపూలు, స్టీల్, ఇతర వస్తువులను ఇక్కడ కొనుక్కోవచ్చు.
బయట ప్రపంచంలో ఉండే స్వేచ్ఛను టెంపరరీగా కోల్పోయి, జైలు నియమ నిబంధనలకు లోబడి గడపడం వల్ల మనిషిలో క్రమశిక్షణ పెరుగుతుందని జైలు అధికారులు చెబుతున్నారు. తమ జీవితంలో జైలు రూపంలో కొత్త అనుభూతిని పొందాలనుకునే వారికి, హిస్టరీని తెలుసుకోవాలనే ఆసక్తి గల వారికి ఈ చంచల్‌గూడ జైలు మ్యూజియం ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుంది.





