Just TelanganaLatest News

Stree Ride : మహిళల సేఫ్టీ కోసం కొత్త యాప్.. స్త్రీ రైడ్ సేవలు షురూ

Stree Ride : సాధారణంగా వేరే క్యాబ్‌లలో , బైక్ రైడ్‌లలో మేల్ డ్రైవర్లు ఉన్నప్పుడు మహిళలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కానీ ఈ స్త్రీ రైడ్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే, లేడీ డ్రైవర్లు మాత్రమే వచ్చి సేఫ్‌గా దింపుతారు.

Stree Ride

మహిళల సేఫ్టీ కోసం, అలాగే వారికి సొంతంగా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించడం కోసం తెలంగాణలో పోలీసులు స్త్రీ రైడ్(Stree Ride) అనే ప్రోగ్రామ్‌ను మొదలుపెట్టారు. ఈ కొత్త ట్రాన్స్‌పోర్ట్ సర్వీసును రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అధికారికంగా ప్రారంభించారు.

మనం రోజూ వాడే ఉబర్, ర్యాపిడో, ఓలా లాంటి యాప్స్ లాగానే, ఇది కూడా స్త్రీ రైడ్(Stree Ride) కూడా యాప్ ద్వారా పనిచేస్తుంది. దీని కోసం మోవో ఫ్లీట్ యాప్(Movo Fleet App) అనే స్పెషల్ యాప్‌ను తయారు చేశారు. దీనిలో కేవలం మహిళా డ్రైవర్లు మాత్రమే ఉంటారు, ఎక్కే ప్రయాణికులు కూడా మహిళలే అయి ఉంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది స్త్రీల కోసం ఏర్పాటు చేసిన యాప్.

సాధారణంగా వేరే క్యాబ్‌లలో , బైక్ రైడ్‌లలో మేల్ డ్రైవర్లు ఉన్నప్పుడు మహిళలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్లాలంటే భయపడతారు. కానీ ఈ స్త్రీ రైడ్(Stree Ride) యాప్ ద్వారా బుక్ చేసుకుంటే, లేడీ డ్రైవర్లు మాత్రమే వచ్చి సేఫ్‌గా దింపుతారు.

దీనివల్ల చదువుకునే అమ్మాయిలకు, ఆఫీసులకి వెళ్లే మహిళలకు జర్నీ చాలా సేఫ్‌గా మారుతుంది. అంతేకాదు, ఈ డ్రైవింగ్ చేసే మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్‌లో కూడా ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ప్రయాణికులను కాపాడగలరు.

Stree Ride
Stree Ride

ఇక మహిళా రైడర్ల విషయానికి వస్తే, వారికిది ఒక అద్భుతమైన ఉపాధి మార్గం. మొదటి విడతలో 55 మంది మహిళలను ఎంపిక చేసి, వారికి ఉచితంగా టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ నడపడంలో ట్రైనింగ్ ఇచ్చారు. అంతేకాదు, వారికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఫ్రీగా ఇప్పించారు.

ఈ యాప్ వల్ల మహిళలు ఎవరిమీదా ఆధారపడకుండా, సొంతంగా కారు, ఆటో, బైక్ నడుపుకుంటూ గౌరవంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. వారి కుటుంబానికి అండగా నిలబడొచ్చు. మొత్తానికి ఈ స్త్రీ రైడ్ యాప్ వల్ల అటు ప్రయాణం చేసే మహిళలకు పూర్తి భద్రత దొరుకుతుంది, ఇటు మహిళలకు మంచి ఉద్యోగం దొరుకుతుంది.

Shreyas Iyer : శ్రేయాస్ కే టీ20 పగ్గాలు..వైభవ్ కు పిలుపు, వైస్ కెప్టెన్ గా తిలక్

Related Articles

Back to top button