Just TelanganaJust PoliticalLatest News

Telangana Voters List : తెలంగాణ ఓటర్ల జాబితా రిలీజ్.. మరి మీ పేరుందో లేదో చూసుకోండి?

Telangana Voters List : ముసాయిదా ప్రక్రియలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయబోతున్నారు.

Telangana Voters List

తెలంగాణలో సమగ్ర సవరణ ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. ఎన్యుమరేషన్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 78.03 శాతం ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు.

ముసాయిదా లిస్ట్ విడుదల సందర్భంగా గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంతో పాటు ఇతర పార్టీల నాయకులు హాజరైన ఈ సమావేశంలో, రాబోయే ఓట్ల సవరణ ప్రక్రియలో చేపట్టాల్సిన చర్యలపై సీఈవో సుదర్శన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

ఈ ముసాయిదా ప్రక్రియలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయబోతున్నారు. ఎన్యూమరేషన్ వివరాల్లో 2002 ఎస్‌ఐఆర్ వివరాలను పేర్కొనకుండా సబ్‌మిట్ చేసిన 32.36 లక్షల మందిని అన్‌మ్యాపింగ్ ఓటర్లుగా గుర్తించి వారందరికీ నోటీసులు అందిస్తారు.

అలాగే ఎన్యూమరేషన్ ఫామ్‌లలో ఎస్‌ఐఆర్ వివరాలు అసంబద్ధంగా ఉన్న చాలామందిని అనామలిస్ ఓటర్లుగా పేర్కొంటూ ప్రకటన సిద్ధం చేశారు. వీరికి తోడు దాదాపు 73 లక్షల మందిని ఏఎస్డీ (అబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్) లిస్టులో చేర్చారు.

Telangana Voters List
Telangana Voters List

ఓటరు జాబితాలో తమ పేరు లేని వారు ఫామ్ 6ఏ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరణలు, అభ్యంతరాలు లేదా క్లెయిమ్‌లను సమర్పించడానికి సెప్టెంబర్ 16 / సెప్టెంబర్ 17 వరకు ఫైనల్ డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. ఈ పరిశీలన ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత అక్టోబర్ 19న ఆమోదించిన ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను అధికారులు ప్రకటిస్తారు.

మీ ఓటరు నమోదు వివరాలు ఎలా ఉన్నాయో, సరిచూసుకోవడానికి, అలాగే ముసాయిదా జాబితాలో మీ పేరు చెక్ చేయడానికి లేదా అప్లికేషన్‌ ప్రాసెస్ కోసం [Chief Electoral Officer, Telangana](https://ceotelangana.nic.in) వెబ్‌సైట్ లేదంటే భారత ఎన్నికల సంఘానికి చెందిన [Voter Services Portal](https://voters.eci.gov.in) పోర్టల్‌ను సందర్శించొచ్చు.

BJP : ఏపీకి ట్రిపుల్ ఆఫర్ తెలంగాణకు ఊహించని షాక్..బీజేపీ కొత్త జాతీయ టీమ్ ఇదే..

Related Articles

Back to top button