Just InternationalJust Lifestyle

World Mysteries:శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రపంచ రహస్యాలు ఇవే..!

World Mysteries:ఈ విశ్వం అనేక రహస్యాలకు నిలయం. సైన్స్, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ మానవమాత్రులు తెలుసుకోలేకపోయిన ఎన్నో రహస్యాలు ఈ భూమిమీద ఉన్నాయి.

World Mysteries:ఈ విశ్వం అనేక రహస్యాలకు నిలయం. సైన్స్, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ మానవమాత్రులు తెలుసుకోలేకపోయిన ఎన్నో రహస్యాలు ఈ భూమిమీద ఉన్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ శాస్త్రవేత్తలు ఆ రహస్యాలను ఛేదించలేకపోయారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

World Mysteries

1. డెవిల్స్ కెటిల్, అమెరికా: అమెరికాలోని ఒక రహస్య ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం పేరు ‘డెవిల్స్ కెటిల్’. నదిలో నుంచి వచ్చిన నీరు ఈ కెటిల్‌లో పడి మాయమైపోతుంది. నిజానికి నీరు వెళ్లడానికి కింద ఎలాంటి మార్గం లేదు, కానీ నీరు మాత్రం నిలువ ఉండదు. ఇందులోని రహస్యాన్ని కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం శూన్యం. నీరు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునేందుకు ఇందులో కొన్ని పరికరాలను కూడా అమర్చారు, కానీ ఆ వస్తువులు కూడా మాయమయ్యాయి. నీరు ఎక్కడికి వెళ్తుందనే నిజం, వారు అమర్చిన వస్తువులు.. రెండూ ఇప్పటికీ బయటపడలేదు.

2. రిచాట్ స్ట్రక్చర్, సహారా ఎడారి: ఈ చిత్రంలో కనిపిస్తున్నది అంతరిక్షం కాదు. ఆఫ్రికాలోని సహారా ఎడారిలో ఉన్న ఒక రహస్య నిర్మాణం. 50 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం విస్తరించి ఉంది. దీన్ని అక్కడి ప్రజలు ‘రిచాట్ స్ట్రక్చర్’, ‘ఐ ఆఫ్ ఆఫ్రికా’ అని పిలుస్తారు. కనుగుడ్డులా కనిపించే ఈ ఆకారం అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత పెద్దదిగా ఉంటుంది. అయితే దీన్ని ఎవరు, ఎందుకు నిర్మించారనేది పెద్ద మిస్టరీ. ఎన్ని పరిశోధనలు చేసినా శాస్త్రవేత్తలు ఈ గుట్టు విప్పలేకపోయారు. చాలా మంది దీన్ని ఏలియన్స్ నిర్మించాయని నమ్ముతారు.

3. గిజా గ్రేట్ పిరమిడ్, ఈజిప్ట్: ఈజిప్ట్‌లో ఉన్న ‘గిజా గ్రేట్ పిరమిడ్’ ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. ఎందుకంటే దీని నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు ఒక్కోటీ సుమారు 45 వేల కిలోల బరువు ఉంటాయి. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో కూడా కేవలం 20 వేల కిలోలను మాత్రమే ఎత్తగలిగే క్రేన్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ వందల ఏళ్ల క్రితం ఇంత బరువైన రాళ్లను ఎలా ఎత్తి పిరమిడ్ నిర్మించారనేది అంతుచిక్కని రహస్యం. అంతే కాదు, ఈ పిరమిడ్‌లో ఎన్ని నేలమాళిగలు ఉన్నాయో కూడా ఎవరూ తెలుసుకోలేకపోయారు.

4. బెకన్ ఆఫ్ మారకైబో, వెనుజులా: దక్షిణాఫ్రికాలోని వెనుజులాలో ఒక వింత సరస్సు ఉంది. దీన్ని అక్కడి ప్రజలు ‘బెకన్ ఆఫ్ మారకైబో’ అని పిలుస్తారు. దీనిపై నిరంతరం మెరుపులు, పిడుగులు వస్తూనే ఉంటాయి. ఇక్కడ ప్రతి గంటకు వేల సంఖ్యలో పిడుగులు పడుతుంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని సహజ శక్తి కేంద్రంగా కూడా పిలుస్తారు. అయితే కేవలం ఈ ప్రాంతంలోనే పిడుగులు, మెరుపులు ఎందుకు వస్తుంటాయి అనేది మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ గుట్టును మాత్రం రాబట్టలేకపోయారు చాలా మంది శాస్త్రవేత్తలు.

ఒళ్లంతా టాటూలతో గిన్నిస్ రికార్డు సాధించిన ‘టాటూ మ్యాన్’:తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఇలాంటి ప్రయత్నాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటే, మరికొందరు ఆ ప్రయత్నంలో ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా, ఒక వ్యక్తి తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని తన ఒళ్లంతా టాటూలు వేయించుకున్నాడు. కంటిని, ముక్కును కూడా వదలకుండా టాటూలు వేయించుకున్నాడు. అతని పేరు మాట్ గోన్. అతను తన ఒళ్లంతా 848 స్క్వేర్ టాటూలను వేయించుకున్నాడు. దీంతో అతను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవ్వడమే కాదు, గిన్నిస్ బుక్‌లో కూడా చోటు దక్కించుకున్నాడు.

మాట్ పుట్టినప్పుడు కొన్ని లోపాలతో పుట్టాడు. వాటిని కనిపించకుండా చేయడం కోసం టాటూలను వేయించుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అదే అతని అభిరుచి (ప్యాషన్) అయిపోయింది. మొట్టమొదటిసారి 1985లో టాటూ వేయించుకున్నాడు. కళ్ళలో, ముక్కులో, నాలుకపై కూడా టాటూలు వేయించుకున్నాడు. కళ్ళలో, ముక్కులో టాటూ వేయించుకున్నప్పుడు ఎక్కువగా నొప్పి పెట్టిందని అతను తెలిపాడు. 2014లో మాట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. అయితే, అతనిలా ఎవరూ ప్రయత్నించవద్దని మాట్ సూచిస్తున్నాడు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button