Just Andhra PradeshLatest News

Visakha: విశాఖ రైల్వే స్టేషన్‌లో రిలాక్సింగ్ ప్లేస్..లగ్జరీ క్యాప్సూల్ హోటల్

Visakha:ప్రయాణికుల కోసమే రైల్వే అధికారులు విశాఖ రైల్వే స్టేషన్ ‌లో ఇప్పుడు ఒక స్టార్ హోటల్ రేంజ్‌లో నామినల్ ప్రైస్‌కు లగ్జరీ వసతిని అందిస్తున్నారు.

Visakha: విశాఖపట్నం రైల్వే స్టేషన్ అధికారులు ప్రయాణికుల కోసం ఓ అద్భుతమైన, వినూత్న సేవను ప్రారంభించారు. సాధారణంగా, సుదూర ప్రయాణాల తర్వాత ప్రయాణికులు రైలు దిగిన వెంటనే కానీ.. నెక్స్ట్ వచ్చే రైలు కోసం గంటల తరబడి వేచి ఉన్నప్పుడు కానీ కాస్త రిలాక్స్ అవ్వాలని కోరుకుంటారు. ప్లాట్‌ఫారమ్‌పై కుర్చీల్లోనో, రిఫ్రెష్‌మెంట్ రూమ్‌ల్లోనో విశ్రాంతి తీసుకోవడం, లేదా సమీపంలోని హోటళ్లకు వెళ్లడం పెద్దగా నచ్చదు పైగా ఖర్చుతో కూడుకున్న పని అవడంతో పెద్దగా ఇష్టపడరు. అలాంటి ప్రయాణికుల కోసమే రైల్వే అధికారులు విశాఖ రైల్వే స్టేషన్ ‌లో ఇప్పుడు ఒక స్టార్ హోటల్ రేంజ్‌లో నామినల్ ప్రైస్‌కు లగ్జరీ వసతిని అందిస్తున్నారు.

Visakha Railway Station..

ఈస్ట్ కోస్ట్ రైల్వే చరిత్రలో తొలిసారి స్లీపింగ్ పాడ్స్ ..
ఈస్ట్ కోస్ట్ రైల్వే చరిత్రలోనే తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్‌లో ‘స్లీపింగ్ పాడ్స్’ అందుబాటులోకి వచ్చాయి. ‘క్యాప్సూల్ హోటల్’ పేరుతో ప్రారంభమైన ఈ వసతి సౌకర్యం, అచ్చం రైలులోని ఏసీ కోచ్‌లో ఉండే అనుభూతిని అందిస్తుంది . .అది కూడా చాలా సరసమైన ధరలకు. విదేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించే ఈ ‘విన్నర్ స్లీపింగ్ పాడ్స్’ సౌకర్యాన్ని ఇప్పుడు విశాఖపట్నంలో ప్రవేశపెట్టడం ఒక విప్లవాత్మక అడుగు అనే చెప్పొచ్చు. తక్కువ స్థలంలో సౌకర్యవంతమైన, లగ్జరీ విశ్రాంతి తీసుకోవాలని కోరుకునేవారికి ఇది ఒక చక్కటి ప్లేస్ అనడంలో ఏమాత్రం అనుమానం అక్కరలేదు.

స్లీపింగ్ పాడ్స్ ప్రత్యేకతలు ఇవే..
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో మొదటిసారిగా విశాఖ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ స్లీపింగ్ పాడ్స్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి:

రైలు బోగీ అనుభూతి: రైలు బోగీలు లేదా స్లీపర్ బస్సుల్లోని ఏసీ బెర్త్‌లు ఎలా ఉంటాయో, సేమ్ అలాగే బెడ్స్‌ను తీర్చిదిద్దారు. ప్రయాణికులకు రైలు కోచ్‌లో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగించేలా వీటిని డిజైన్ చేశారు.

పూర్తి ప్రైవసీ: ప్రతి స్లీపింగ్ పాడ్‌లో వ్యక్తిగత ప్రైవసీకి ప్రాధాన్యత ఇచ్చారు.

ఆధునిక సౌకర్యాలు: ఏసీ సదుపాయం, ఫ్రీ వైఫై, స్నాక్స్, వేడి నీటితో స్నానం చేసే సౌకర్యం, ప్రయాణికుల కోసం సమాచారం అందించే స్పెషల్ డెస్క్, ఆధునిక వాష్‌రూమ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

రైల్వే స్టేషన్‌లో ఎక్కడ, ధర ఎంత, ఇంకా ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి..?

ఈ క్యాప్సూల్ హోటల్ విశాఖ రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌లో, మొదటి అంతస్తులో ఏర్పాటు చేయబడింది.

మొత్తం పాడ్స్: 88 స్లీపింగ్ పాడ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో సింగిల్ బెడ్స్ 73 ఉండగా..డబుల్ బెడ్స్ 15 ఉన్నాయి.

మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు: 18 స్లీపింగ్ పాడ్స్‌ను మహిళల కోసం స్పెషల్‌గా కేటాయించారు. వీటికి ప్రత్యేక వాష్‌రూమ్‌లు, డ్రెస్సింగ్ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి.

ధరల వివరాలు :

సింగిల్ బెడ్:

3 గంటలకు: రూ. 200

24 గంటలకు: రూ. 400

డబుల్ బెడ్:

3 గంటలకు: రూ. 300

24 గంటలకు: రూ. 600

ప్రయాణికులకు సరసమైన, సౌకర్యవంతమైన వసతిని అందించాలని అనుకున్నామని వాల్తేరు రైల్వే అధికారులు చెప్పారు. విద్య, వైద్యం, పర్యాటకం కోసం వచ్చే వారికి వసతికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ..చాలా సందర్భాల్లో ఉన్న వసతి గృహాలు ఖాళీగా లేకపోవడం, ఎక్కువ ధరలు, సౌకర్యవంతంగా లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారని గుర్తు చేశారు. అందుకే, బడ్జెట్ ఫ్రెండ్లీ వసతి కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఈ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం తీరుస్తుందని అధికారులు వివరించారు.

మొత్తంగా విశాఖ రైల్వే స్టేషన్‌లో ఈ కొత్త ‘క్యాప్సూల్ హోటల్’ ప్రయాణికులకు ఒక సరికొత్త, సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుంది అనడంలో డౌటే లేదు. మరి దీని క్రేజ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button