age: వయసును ఇలా వెనక్కి మళ్లిద్దామా..?
age:వయసు పెరుగుతున్న కొద్ది వృద్ధాప్య ఛాయలు కనిపించడం కామన్.

age:వయసు పెరుగుతున్న కొద్ది వృద్ధాప్య ఛాయలు కనిపించడం కామన్. అయితే ఇప్పుడు కొంత మందిలో చిన్నవయసులోనే వృద్ధాప్య ఛాయలు(premature aging) కనిపిస్తుండటంతో.. మానసికంగా కూడా డిస్టర్బ్ అవుతున్నారు. దీంతో యవ్వనంగా కనిపించడానికి చాలా డబ్బును, టైమ్‌ను వృధా చేస్తూ అనవసర ప్రొడక్ట్స్ ట్రై చేస్తుంటారు.
anti-aging
యవ్వనంగా, స్కిన్ మెరిసేలా కనిపించాలంటే పైపై మెరుగులు కావు..వారు తీసుకునే ఆహారం చాలా ముఖ్యమనే విషయాన్ని మర్చిపోతుంటారు. అలాగే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా చర్మం(skin care) పాడై వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఏజింగ్‌కు గుడ్ బై చెప్పి వయస్సును వెనక్కి మళ్లించాలంటే దూరంగా ఉంచాలసిన ఆ ఆహారాలేంటో ఓసారి చూద్దాం.
వేయించిన ఆహారం..
ఫ్రైడ్ ఫుడ్ చర్మ కణాలను దెబ్బతీసి, చర్మాన్ని బలహీనపరిచే ఫ్రీ రాడికల్స్‌ను విడుదల చేస్తుంది. కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్ పొటాటో ఫ్రైస్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా తక్కువగా తీసుకోవాలి.
చక్కెర పదార్థాలు..
చక్కెర ఎక్కువగా తినడం వల్ల కొల్లాజెన్-నష్టపరిచే AGEల పెరుగుదలకు దోహదపడే అవకాశం ఉంటుంది. అలాగే అధిక మోతాదులోని చక్కెర చర్మ సమస్యలను కలిగిస్తుంది. సో, తీపి తినాలని అనిపించినప్పుడు చక్కెరకు బదులు పండు లేదా డార్క్ చాక్లెట్ తినడం మంచిది.
ప్రాసెస్ చేసిన మీట్..
బేకన్, సాసేజ్, పెప్పరోని వంటి ప్రాసెస్ చేసిన ఫుడ్ సంతృప్త కొవ్వు, సల్ఫైట్‌లతో నిండి ఉండటంతో.. కొల్లాజెన్‌ను బలహీనపరుస్తుంది. అలాగే చర్మంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది.
కెఫిన్ కలిగిన పానీయాలు..
సోడా, కాఫీ తాగడం వల్ల చర్మంపై ప్రభావం పడుతుంది. అలాగే నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది. నిద్రలేమి వల్ల వృద్ధాప్యం, ముడతలు, నల్లటి వలయాలు ఏర్పడతాయి. కెఫిన్ ఉన్న పానీయాలను వీలైనంత వరకు తక్కువగా వాడాలి.
ఆల్కహాల్…
ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల ముడతలు, కొల్లాజెన్ లేమికి, వాపు, ఎరుపు వంటి అనేక చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇది విటమిన్ -ఎ తో సహా కొన్ని పోషకాల లోపాలను కూడా తీసుకొస్తుంది.
వైట్ బ్రెడ్…
వైట్ బ్రెడ్ తినడం వలన కూడా వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో మంటను కలిగిస్తుంది. కాబట్టి వైట్ బ్రెడ్‌కు బదులు చర్మానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే మొలకెత్తిన మల్టీగ్రెయిన్ బ్రెడ్‌ని తినడానికి ప్రయత్నించండి.
వీటితో పాటు డైలీ ఎక్సర్ సైజులు,యోగా,వాకింగ్, సైక్లింగ్ వంటివి చేయడం, సరైన నిద్ర ఉండేలా చూసుకుంటే ఇక మీ వయసు మీచేతిలోనే..
Super