Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..రెండు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు
Rain Alert:రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Rain Alert:రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
Rain Alert:
తెలంగాణలో వాతావరణం
Rain Alert:తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఈ రోజు (జూలై 9), రేపు (జూలై 10) గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు(Thunderstorms
) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు(Rain Alert) కురిసే సూచనలున్నాయి.
ముఖ్యంగా, ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం (ఆసిఫాబాద్), మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్(YellowAlert) జారీ చేయబడింది. అలాగే, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోనూ ఈ రోజు (జూలై 9) మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి.
గత 24 గంటల్లో (జులై 8న) నమోదైన వర్షపాతం వివరాలు: కర్నూలు జిల్లాలోని ఆదోనిలో 37 మి.మీ, కౌతాళంలో 23.5 మి.మీ, అనంతపురంలో 22 మి.మీ, మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రేఖపల్లిలో 18.25 మి.మీ వర్షపాతం నమోదైంది.వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించబడింది.