Trump and Elon Musk: డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య ఏం జరుగుతోంది?
Trump and Elon Musk:ఒకప్పుడు ట్రంప్ , ఎలాన్ మస్క్(Trump and Elon Musk) ఇద్దరూ మంచి మిత్రులు అన్న విషయం అందిరీక తెలిసిందే. అలాంటి ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల రెచ్చగొట్టే ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

Trump and Elon Musk:ఒకప్పుడు ట్రంప్ , ఎలాన్ మస్క్(Trump and Elon Musk) ఇద్దరూ మంచి మిత్రులు అన్న విషయం అందిరీక తెలిసిందే.ఒక రకంగా రెండోసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడానికి ఎలాన్ మస్క్ కారణం అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల రెచ్చగొట్టే ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో దీనికి కారణాలను వెతుక్కునే పనిలో పడ్డారు నెటిజన్లు.
Trump and Elon Musk:
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), బిలియనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన తాజా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. “బిగ్, బ్యూటిఫుల్ బిల్” అంటే బహుశా మౌలిక సదుపాయల బిల్లును ఉద్దేశించి మస్క్ చేసిన విమర్శలకు ట్రంప్ ధీటైన సమాధానం ఇచ్చారు.
ట్రంప్ మాట్లాడుతూ, “ఎలాన్ చరిత్రలో మరెవరికీ లేనంత సబ్సిడీలు పొందారు. ఆ సబ్సిడీలు లేకపోతే, ఎలాన్ తన వ్యాపారాన్ని మూసివేసి బహుశా దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది” అని ఘాటుగా విమర్శించారు. సబ్సిడీలు లేకుంటే, ఇకపై రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు లేదా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ఉండదని, ఇది అమెరికా సంపదను ఆదా చేస్తుందని కూడా ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మస్క్, ట్రంప్‌ల మధ్య గతంలో ఉన్న సంబంధాలు, ముఖ్యంగా వ్యాపార ప్రపంచంలో ప్రభుత్వ సబ్సిడీల పాత్రపై చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చాయి.
అయితే ఇటీవల అమెరికా రాజకీయాల్లో బిలియనీర్ ఎలోన్ మస్క్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా X లో ఆయన చేసిన పోస్ట్, దేశంలో మూడో రాజకీయ పార్టీ(Third Party) అవసరాన్ని లేవనెత్తింది. “మనం అమెరికా పార్టీని ఏర్పాటు చేయాలా?” అంటూ మస్క్ పెట్టిన ఒపీనియన్ పోల్, ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ట్రంప్‌తో ఆయన సంబంధాలపై, భవిష్యత్ రాజకీయాలపై పలు ప్రశ్నలు రేపుతోంది.
ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంలో కీలక పాత్ర పోషించిన మస్క్, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారబోతున్నారా? అభిశంసన ద్వారా ట్రంప్‌ను తొలగించి, తాను అధ్యక్ష పీఠం ఎక్కాలని ఆశిస్తున్నారా? కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో భాగంగానే ఈ పోస్ట్ చేశారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మస్క్ థర్డ్ పార్టీ ఆలోచన – సాధ్యమా?
మస్క్ పోస్ట్‌పై స్పందిస్తూ ఒక యూజర్, “ఎలోన్ థర్డ్ పార్టీని ప్రారంభించడం టెస్లా, స్పేస్‌ఎక్స్‌ల మాదిరిగానే ఉంటుంది. విజయవంతమయ్యే అవకాశాలు తక్కువ, కానీ అది విజయవంతమైతే, అది ఆటను పూర్తిగా మార్చేస్తుంది” అని వ్యాఖ్యానించారు. దీనికి మస్క్ సానుకూలంగా స్పందించి, తాను కేవలం ఆలోచనలపైనే కాకుండా వాటిని అమలు చేసే సంభావ్య వ్యూహాలపై కూడా పని చేయగలనని సూచించారు.
అమెరికాలో మూడో పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన కొత్తదేమీ కాదు. గతంలో అనేక ప్రయత్నాలు జరిగినా, అవి పరిమితంగానే విజయం సాధించాయి. అయితే, మస్క్ వంటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యక్తి, బలమైన బ్రాండ్ విలువ, టెక్ కమ్యూనిటీతో పాటు స్వతంత్ర ఓటర్లలో ఉన్న లోతైన ప్రభావం అతని ఆలోచనను ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ట్రంప్‌తో మస్క్ విభేదాలు – కారణం ఏంటి?
మస్క్ ఈ సంచలన పోస్ట్ చేయడానికి ప్రధాన కారణం, ట్రంప్ తీసుకువచ్చిన “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్” అని భావిస్తున్నారు. ఈ బిల్లులో వలసదారుల బహిష్కరణ ప్రచారానికి భారీ బడ్జెట్‌ను కేటాయించారు. దీనివల్ల రాబోయే పదేళ్ళలో దేశ ఆర్థిక లోటు $3.3 ట్రిలియన్లు పెరుగుతుందని మస్క్ అంచనా వేస్తున్నారు. ఈ విషయంలోనే ట్రంప్‌తో మస్క్‌కు విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎలోన్ మస్క్, ప్రభుత్వ సామర్థ్య విభాగం (DOGE)లోని తన కీలక పదవికి రాజీనామా చేశారు.
మస్క్ ఈ బిల్లును బహిరంగంగా విమర్శిస్తూ, ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఆత్మహత్యాసదృశమని, ప్రభుత్వ వ్యయం, అసమర్థతను ప్రోత్సహిస్తుందని వ్యాఖ్యానించారు. ఇది టెక్ కంపెనీలు, స్టార్టప్‌లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆయన మండిపడ్డారు. దీనికి ప్రతిస్పందనగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మస్క్‌ను హెచ్చరించారు. మస్క్ కంపెనీలకు ఇచ్చే ఫెడరల్ సబ్సిడీని రద్దు చేస్తామని బెదిరించడమే కాకుండా, మస్క్ వలస స్థితిపై దర్యాప్తు చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలు అమెరికా రాజకీయాల్లో కొత్త మలుపులకు దారి తీస్తాయా అనేది వేచి చూడాలి.