Just PoliticalJust NationalLatest News

Rivaba Jadeja: రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాకు మంత్రి పదవి..మంత్రివర్గ కూర్పు వెనుక ఏం జరిగింది?

Rivaba Jadeja: క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా రవీంద్రసింహ్ జడేజా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Rivaba Jadeja

గుజరాత్ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచే విధంగా, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో ఇవాళ (అక్టోబర్ 17, 2025) పెద్ద స్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ అనూహ్య మార్పులో, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా రవీంద్రసింహ్ జడేజా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో భారీ మార్పులు..సీఎం భూపేంద్ర పటేల్ మినహా, పాత క్యాబినెట్‌లోని మొత్తం 16 మంది మంత్రులు రాజీనామా చేయడంతో ఈ పునర్వ్యవస్థీకరణ జరిగింది. కొత్తగా 26 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఇందులో కేవలం 6 మంది పాత మంత్రులను కొనసాగించగా, ఏకంగా 19 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. దీనితో పాటు, యువ నేత హర్ష్ సంఘవీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

Rivaba Jadeja
Rivaba Jadeja

1990 సెప్టెంబర్ 5న జన్మించిన రివాబా జడేజా , 34 ఏళ్ల వయస్సులో మెకానికల్ ఇంజినీరింగ్‌ (రాజ్‌కోట్) పూర్తి చేశారు. 2016లో క్రికెటర్ రవీంద్ర జడేజాతో ఆమె వివాహం జరిగింది.

Rivaba Jadeja
Rivaba Jadeja

2019లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన ఆమె, 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆమె AAP అభ్యర్థి కర్షన్‌భాయ్‌పై 53,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. గతంలో ఆమె కుటుంబం కాంగ్రెస్‌తో సంబంధాలు కలిగి ఉన్నా కూడా..రివాబా బీజేపీలో చేరడం గమనార్హం.

Rivaba Jadeja
Rivaba Jadeja

రివాబాకు మంత్రిపదవి ఇవ్వడం బీజేపీ యొక్క “స్ట్రాటజిక్ రీసెట్” లో భాగంగా కనిపిస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికలు , రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కొత్త ముఖాలను ముందుకు తేవడం, సౌరాష్ట్ర ప్రాంతంలో పట్టు బలోపేతం చేయడం ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు.

కొత్త క్యాబినెట్‌లో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యతనిచ్చారు. దీనిలో భాగంగా 8 మంది OBC వర్గం. 6 మంది పాటిదార్ కమ్యూనిటీ, 4 మంది తెగల వర్గం, 3 మంది దళిత వర్గం, మహిళా ప్రాతినిధ్యం పెంచడంలో భాగంగా 3 మంది మహిళలకు అవకాశం కల్పించారు, వీరిలో రివాబా జడేజా ఒకరు.

కాగా 2022 ఎన్నికల సమయంలో రివాబా రూ.100 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించి, గుజరాత్‌లోని అత్యంత ధనవంతమైన ఎమ్మెల్యేలలో ఒకరిగా నిలిచారు.

ఆమె గతంలో కర్ణి సేన మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. రాజ్‌పుత్ కమ్యూనిటీలో ఆమెకున్న ప్రభావం, రవీంద్ర జడేజా యొక్క జాతీయ క్రీడా కీర్తి కూడా ఆమె రాజకీయ ఎదుగుదలకు దోహదపడ్డాయి.

2023లో జామ్‌నగర్ మేయర్ బీనా కోఠారీతో జరిగిన బహిరంగ వివాదంలో ఆమె “ఔకాత్” అనే పదాన్ని ఉపయోగించడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది.

క్రీడా ప్రముఖుల కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావడం అనేది భారత రాజకీయాల్లో కొత్తేమీ కాకపోయినా, ఈ చిన్న వయస్సులోనే రివాబా మంత్రిగా ప్రమాణం చేయడం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

Bigg Boss: బిగ్ బాస్ ఆరోవారం..’ఫ్యామిలీ మ్యాన్’ భరణి సేఫ్, ఎలిమినేషన్ గండంలో సుమన్ శెట్టి!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button