Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss: బిగ్ బాస్‌ ఓటింగ్‌లో దూసుకుపోతోన్న కళ్యాణ్,తనూజ..డేంజర్ జోన్‌లో వారిద్దరు

Bigg Boss :హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ఒక చిన్నపాటి యుద్ధాన్నే తలపించింది.

Bigg Boss

బిగ్ బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 9 ఏడో వారంలోకి అడుగు పెట్టింది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత హౌస్ నిజంగానే రణరంగంగా మారిపోయింది. హౌస్(Bigg Boss) మేట్స్ మధ్య మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ఒక చిన్నపాటి యుద్ధాన్నే తలపించింది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు పర్సనల్ అటాక్స్ చేసుకున్నారు. ముఖ్యంగా రీతూ చౌదరి వర్సెస్ ఆయేషా , తనూజ వర్సెస్ రమ్య మోక్ష గొడవలు మరీ తారా స్థాయికి చేరుకున్నాయి.

ఈ వారం, గత వారాల కంటే భిన్నంగా ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లిస్ట్‌లో రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, దివ్య, సంజనా, రమ్య మోక్ష, శ్రీనివాస సాయి నిలిచారు. . ఈ ఎనిమిది మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది.

నామినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను కాపాడుకోవడానికి అభిమానులు ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా తమ సపోర్టును తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్స్ ప్రకారం, ప్రస్తుతం ఓటింగ్‌లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి.

Bigg Boss
Bigg Boss

కంటెస్టెంట్ కళ్యాణ్ ప్రస్తుతం ఓటింగ్‌లో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నారు. ఇక బిగ్ బాస్ బుట్టబొమ్మగా పిలవబడుతున్న తనూజ రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం టాప్ ప్లేస్ కోసం వీరిద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. సంజన మూడో స్థానంలో ఉండగా, రీతూ చౌదరి నాలుగో ప్లేస్‌లో కొనసాగుతోంది. రమ్య మోక్ష ఐదో స్థానంలో, దివ్య నికితా ఆరో ప్లేస్‌లో ఉన్నారు.

ఏడు, ఎనిమిది స్థానాలో వరుసగా రాము రాథోడ్ , శ్రీనివాస సాయి ఉన్నారు. అంటే ప్రస్తుతం ఈ రాము , శ్రీనివాస సాయి ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారన్నమాట.

ఓటింగ్‌కు దాదాపు ఇంకా మూడు రోజుల సమయం ఉంది కాబట్టి, ఓటింగ్ ట్రెండ్స్‌లో మార్పులు జరగడానికి అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతానికి ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే మాత్రం, రాము రాథోడ్ లేదా శ్రీనివాస సాయి ల్లో ఎవరైనా ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వక తప్పదు.

ICC:ట్రోఫీ పంపిస్తావా ? లేదా ?.. నఖ్వీకి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button