Rape case: సంచలనం రేపిన తుని అత్యాచారం కేసు..మానసిక నిపుణులు ఏం చెబుతున్నారు?
Rape case: తునిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని చెరువులోకి దూకి చనిపోయిన ఘటన పెను సంచలనం రేపింది.

Rape case
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం(Rape case) కేసులో ప్రధాన నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని చెరువులోకి దూకి చనిపోయిన ఘటన పెను సంచలనం రేపింది. ఈ ఘటన పోలీసుల భద్రత, కేసుల నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.
తుని గ్రామానికి చెందిన, రాజకీయ అనుబంధాలు ఉన్న వ్యక్తిగా తెలిసిన తాటిక నారాయణ రావు (60-62 సం||) ఈ కేసులో ప్రధాన నిందితుడు. స్థానిక గురుకుల పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల బాలికను నిందితుడు పాప తన మనమరాలిగా చెప్పుకుని, అనారోగ్యంతో ఉన్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. దారిలో ఒక గార్డెన్ వద్ద బాలికపై అత్యాచారం(Rape case) చేసినట్లు బాధిత కుటుంబం తీవ్ర ఆరోపణలు చేసింది.
స్థానికుడుతీసిన వీడియో వైరల్ అయి ఘటన వెలుగులోకి రాగానే సమాజంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళా సంఘాలు పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, అతడిపై పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు.
అయితే నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తుండగా, ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిందితుడు నారాయణ రావు వాష్‌రూమ్ అవసరం చెప్పి వాహనం ఆపాల్సిందిగా కోరాడు. వాహనం ఆపగానే, అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసి, సమీపంలో ఉన్న కోమటి చెరువులోకి దూకాడు.పోలీసులు వెంటనే గజఈతగాళ్లను రంగంలోకి దించి గాలించగా, చివరికి అతని మృతదేహం లభించింది.
పోలీసుల కస్టడీలో ఉన్న అత్యాచారం కేసు నిందితుడు, అందులోనూ వయస్సు మీరిన వ్యక్తి, ఇలా సులభంగా తప్పించుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటీవల కాలంలో నిందితులు ఇదే తరహాలో వాష్‌రూమ్ లేదా ఆరోగ్య కారణాలు చెప్పి కస్టడీ నుంచి తప్పించుకున్న సంఘటనలు చాలానే నమోదయ్యాయి.
ఈ (Rape case)సంఘటనలు పోలీస్ భద్రత, పీపుల్ కంట్రోల్‌లో ఉన్న లోపాలను స్పష్టంగా వెలికితీస్తున్నాయి. బాలల కేసుల్లో ఇంతటి నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో.. బాలికల భద్రతపై సమాజం, కుటుంబం, పాఠశాలలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.ఎంతటి అనుభవం, పలుకుబడి ఉన్న వ్యక్తులైనా, లేదా స్కూల్‌లో బాగా తెలిసిన వారైనా సరే… వారిని గుడ్డిగా నమ్మరాదంటున్నారు.
ఎవరైనా తల్లిదండ్రులు, స్నేహితుల పేరు చెప్పి వచ్చినా, స్టాఫ్ లేదా బాధ్యుల సమక్షంలోనే మాట్లాడాలి. ఒంటరిగా బయలుదేరకూడదని చెబుతున్నారు. విద్యార్థినులు తమ భద్రత విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని..ఏదైనా అనుమానం వచ్చినా లేదా ఇబ్బంది అనిపించినా వెంటనే స్కూల్ టీచర్స్, హెడ్‌మాస్టర్ లేదా తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.పెప్పర్ స్ప్రే, వ్యక్తిగత అలారం, ఫోన్‌లో SOS/భద్రతా యాప్‌లు వంటివి ఉపయోగించుకోవడం నేర్చుకోవాలని చెబుతున్నారు.
అలాగే బాలికల భద్రత కోసం పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లు, గురుకులాలు కఠిన నిబంధనలు పాటించాలి. స్కూల్ విజిటర్ల విషయంలో పూర్తి వెరిఫికేషన్ చేసి, వారిపై దృష్టి నిలిపే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. బాధిత బాలికకు తక్షణమే మానసిక, వైద్య మద్దతు కల్పించడం అత్యవసరం. ఇలాంటి తీవ్ర ఘటనల తర్వాత పిల్లల్లో భయం, ఒత్తిడి పెరుగుతాయి కాబట్టి, మానసిక నిపుణుల కౌన్సెలింగ్, తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమన్వయం తప్పనిసరిగా ఉండాలి.