Home tips:గ్యాస్ స్టౌవ్, బర్నర్స్ ఐదు నిమిషాల్లోనే మెరిసేలా చేసే ఇంటి చిట్కాలివే..
Home tips: కొన్ని టిప్స్ పాటిస్తే, రకరకాల లోషన్లు వాడాల్సిన అవసరం లేకుండా, కేవలం ఐదు నిమిషాల్లోనే మీ గ్యాస్ స్టౌవ్‌ను శుభ్రం చేసుకోవచ్చు.
Home tips
ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టౌవ్(Home tips) ఎంత శుభ్రంగా ఉంటే వంట చేసేందుకు అంత మోటివేషన్‌గా ఉంటుంది. అయితే, పాలు, పప్పు, అన్నం పొంగడం, వంట చేసేటప్పుడు పడే నూనె మరకలు, జిడ్డు వంటివన్నీ స్టౌపై పేరుకుపోయి, వాటిని క్లీన్ చేయడం చాలా పెద్ద టాస్క్‌గా భావిస్తారు. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే, రకరకాల లోషన్లు వాడాల్సిన అవసరం లేకుండా, కేవలం ఐదు నిమిషాల్లోనే మీ గ్యాస్ స్టౌవ్‌ను శుభ్రం చేసుకోవచ్చు. ఇంట్లోనే అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులతో స్టౌవ్‌ను నిమిషాల్లోనే శుభ్రం చేసే విధానం(Home tips) ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మనం గ్యాస్ స్టౌని ఆఫ్ చేసి, ఓ గుడ్డతో ఒకసారి పైపైన తుడవాలి. ఆ తర్వాత వంట సోడా (బేకింగ్ సోడా) ను ఉపయోగించి క్లీన్ చేయాలి. బేకింగ్ సోడాలో మరకలు, జిడ్డు వంటి వాటిని శుభ్రం చేసే గుణాలు ఉన్నాయి. బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు పోసి పేస్టులా తయారు చేసి, గ్యాస్ స్టౌ మరకలపై అప్లై చేయండి. దీనిని 15 నుంచి 20 నిమిషాలు ఉంచితే, మరకలు బాగా వదులవుతాయి. తర్వాత ఓ స్క్రబ్ తీసుకుని స్టౌపై స్క్రబ్ చేసి, తడిగుడ్డతో బేకింగ్ సోడాని క్లీన్ చేయండి. వెంటనే గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరుస్తుంది.

మరింత మెరుపు కోసం, వెనిగర్‌తో కలిపి ప్రయత్నించవచ్చు. బేకింగ్ సోడాలో నీరు బదులు వెనిగర్ వేసి పేస్టులా చేసి, స్టౌపై మరకలపై రాసి 20 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత తడిగుడ్డతో క్లీన్ చేసి, ఆ తర్వాత మరోసారి పొడిగుడ్డతో తుడిస్తే స్టౌ తళతళ మెరిసిపోతుంది.
ఇక బర్నర్స్ను శుభ్రం చేయడానికి, మొదట వాటిని స్టౌ ఆన్ చేసి కాసేపు వేడి చేయాలి. తర్వాత వాటికి కొద్దిగా నిమ్మరసం రాసి 15 నుంచి 20 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత డిష్‌వాషింగ్ లిక్విడ్‌తో క్లీన్ చేస్తే మరకలు సులభంగా పోతాయి. లేదా, బర్నర్స్‌ని ఉప్పు నీటిలో వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు మరిగించండి. తర్వాత డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి రుద్దినా వెంటనే మరకలు పోయి, కొత్తవాటిలా మెరుస్తాయి. చివరగా, రెండు టేబుల్ స్పూన్ల డిష్‌వాషింగ్ లిక్విడ్‌ని కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి, అందులో బర్నర్స్‌ని వేసి నానబెట్టి, మైల్డ్ డిటర్జెంట్‌తో 20 నుంచి 30 నిమిషాల పాటు రుద్ది క్లీన్ చేసినా కూడా బర్నర్స్ మెరిసిపోతాయి. ఇలాంటి ఇంటి చిట్కాలతో నిమిషాల్లోనే స్టౌవ్ శుభ్రం అవుతుంది.



