shock for Ibomma Ravi: రవికి భారీ షాక్..మిగతా నాలుగు కేసుల్లోనూ అరెస్టుకు రంగం సిద్ధం
Shock for Ibomma Ravi:పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రవిని మొదట అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో అతడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకుని లోతుగా విచారణ చేస్తున్నారు.
Shock for Ibomma Ravi
ఐబొమ్మ(IBOMMA) పైరసీ వెబ్సైట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడుగా ఉన్న రవి(Shock for Ibomma Ravi)కి సైబర్ క్రైమ్ పోలీసులు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒక కేసులో అరెస్టు చేసి విచారణ జరుపుతున్న పోలీసులు, అతడిపై నమోదైన మిగతా నాలుగు కేసుల్లోనూ అధికారికంగా అరెస్టు చేసేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించారు.
పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రవిని మొదట అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో అతడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకుని లోతుగా విచారణ చేస్తున్నారు.
రవిపై పలువురు సినీ నిర్మాతలు ఫిర్యాదు చేయడంతో, అతడిపై మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనూ అరెస్టు చేసి, మొత్తం పైరసీ కార్యకలాపాలను వెలికి తీసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
ఈ మేరకు, మిగిలిన కేసుల్లో రవి(Shock for Ibomma Ravi)ని అరెస్టు చేయడానికి వీలుగా సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా కోర్టులో పీటీ (ప్రొడక్షన్ ట్రాన్సిట్) వారెంట్‌ను దాఖలు చేశారు. దీని ద్వారా మొత్తం పైరసీ నెట్‌వర్క్‌ను ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు.

పైరసీ వ్యవహారంతో పాటు, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషనల్ కార్యకలాపాల్లోనూ రవిపై కేసు నమోదైంది.ఈ కోణంలోనూ పోలీసులు అతడిని ప్రశ్నించనున్నారు.
ఐదు రోజుల పోలీసు కస్టడీలో భాగంగా, రెండో రోజు రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అత్యంత కీలకమైన కోణాల్లో విచారిస్తున్నారు.
రవి ఒక్కడే ఈ భారీ పైరసీ సామ్రాజ్యాన్ని నడిపాడా, లేక అతడి వెనుక కీలక వ్యక్తులు, సహకారులు ఎవరైనా ఉన్నారా అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇతడికి సాంకేతిక సహకారం అందించిన వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.
తొలిరోజు కస్టడీలో భాగంగా, ఐబొమ్మ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం, ఈ నెట్వర్క్ యొక్క సాంకేతిక మూలాలు (Source) వంటి కీలక వివరాలను పోలీసులు రాబట్టిన విషయం తెలిసిందే.
ఈ కేసుల్లో తదుపరి అరెస్టులు, నిందితుడిపై ఉన్న ఇతర కేసుల్లో పీటీ వారెంట్ ద్వారా అరెస్టు చేయాలని పోలీసులు తీసుకున్న నిర్ణయం, పైరసీకి పాల్పడే ఇతరులకు కఠినమైన హెచ్చరికగా మారింది.



