sleep divorces : పెరుగుతున్న స్లీప్ డివోర్స్ ట్రెండ్..
sleep divorces : చాలామంది భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవపడుతూ ఉంటారు. ఇద్దరికీ ఒకరి అలవాట్లు మరొకరికి నచ్చక, విడిపోవాలని అనుకునే దశకు వెళ్తుంటారు.

sleep divorces : ఈ రోజుల్లో బంధాలు కలకాలం నిలబడటం కష్టమవుతోంది. పెళ్లైన కొన్ని నెలల్లోనే విడిపోతున్న జంటలు ఎంతోమంది ఉంటున్నారు. ఇక ఐదేళ్లు, పదేళ్లు కలిసి ఉన్నవాళ్లు కూడా, రోజువారీ గొడవల కంటే విడిపోయి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు. అందుకే కోర్టుల్లో డివోర్స్ కేసులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. అయితే, ఇప్పుడు ఈ డివోర్స్‌కి ఒక కొత్త ప్రత్యామ్నాయం పుట్టుకొచ్చింది .. అదే ‘స్లీప్ డివోర్స్’. విడాకులు తీసుకోకుండానే, జంటలు తమ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారట.
sleep divorces
చాలామంది భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవపడుతూ ఉంటారు. ఇద్దరికీ ఒకరి అలవాట్లు మరొకరికి నచ్చక, విడిపోవాలని అనుకునే దశకు వెళ్తుంటారు. అలాంటి సందర్భాల్లో, పూర్తిగా విడాకులు తీసుకోకుండా, ఒకే ఇంట్లో, ఒకే గదిలో, లేదా ఒకే మంచంపై ఉన్నప్పటికీ, భౌతికంగా దూరం పాటించడమే స్లీప్ డివోర్స్. అంటే, ఎవరి బెడ్ వారికి, లేదా ఎవరి గది వారికి అనే కాన్సెప్ట్ అన్నమాట.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పూర్తిస్థాయి విడాకుల కంటే ఈ స్లీప్ డివోర్స్ కొంత బెటర్ ఛాయిస్. సమాజంలో విడాకుల రేటును తగ్గించడంలో ఇది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఒక రకంగా, ఇది సమాజం కోసం, పిల్లల కోసం, పెద్దల కోసం చేసే ఒక కాంప్రమైజ్.
గొడవలు పడి విడాకులు తీసుకోవాలనుకునే జంటలు తరచుగా వేరువేరు గదుల్లో పడుకోవడమే కాదు, అన్ని పనులు వేరువేరుగా చేసుకుంటారు. కానీ స్లీప్ డివోర్స్‌లో అలా కాదు. భార్యాభర్తలు విడివిడిగా పడుకున్నా, కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం వంటి అన్ని ఇతర పనులను కలిసే చేస్తారు. ఇది బంధానికి కొంత స్పేస్‌ని ఇస్తూనే, కుటుంబ వ్యవస్థను నిలబెడుతుంది.
జీవిత భాగస్వామికి గురక పెట్టడం, రాత్రివేళల్లో మొబైల్ ఫోన్ ఎక్కువ వాడటం, టీవీ చూడటం వల్ల నిద్ర పట్టకపోవడం వంటి అలవాట్లు ఉన్నప్పుడు ఈ స్లీప్ డివోర్స్ గురించి జంటలు ఆలోచిస్తున్నారట. ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల బంధాన్ని పూర్తిగా తెంచుకోవడం కంటే, స్లీప్ డివోర్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
స్లీప్ డివోర్స్ అంటే ఒక విధంగా, బంధాన్ని కాపాడుకుంటూనే, కనీసం కొన్ని గంటల పాటు అయినా ప్రశాంతమైన నిద్రను పొందడం. ఇది వైవాహిక జీవితంలో ఎలాంటి పెద్ద డిస్టర్బెన్స్ లేకుండా, ప్రశాంతమైన నిద్రను కోరుకునే వారికి ఒక మంచి పరిష్కారం అని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం నిద్ర కోసం మాత్రమే కాదు, భాగస్వాముల మధ్య వ్యక్తిగత స్పేస్, మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది.