Just TelanganaLatest News

Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదిక చూడాలనుకుంటున్నారా? అయితే మీ కోసం 3 రోజుల ఫ్రీ ఎగ్జిబిషన్!

Summit :సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక స్టాల్స్ , భవిష్యత్తు ప్రణాళికల ప్రదర్శనను ప్రజలు మూడు రోజుల పాటు ఉచితంగా చూసేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.

Summit

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో(Summit) పెట్టుబడులపై సెషన్లు విజయవంతంగా ముగిసిన వెంటనే, ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక స్టాల్స్ , భవిష్యత్తు ప్రణాళికల ప్రదర్శనను ప్రజలు మూడు రోజుల పాటు ఉచితంగా చూసేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అంటే కందుకూరు వద్ద గ్లోబల్ సమ్మిట్ వేదికకు డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 13 వరకు.. అందరికీ ఈ నాలుగు రోజులూ ప్రవేశం ఉచితమే. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలు, గ్లోబల్ విజన్‌ను దగ్గరగా చూసేందుకు ఇది ఒక అద్భుత అవకాశం.

Summit
Summit

ఈ ప్రదర్శనలో కింది అంశాలు అందుబాటులో ఉంటాయి:

  • భవిష్యత్తు ప్రాజెక్టులపై సెషన్లు.. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాబోయే ప్రాజెక్టుల గురించి వివరాలు.
  • ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు.. ప్రభుత్వ శాఖల్లోని నిపుణులతో నేరుగా మాట్లాడే అవకాశం.
  • ప్రభుత్వ శాఖల స్టాల్స్.. ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతి, అందించే సేవలను ప్రదర్శించే స్టాల్స్.
  • సాంస్కృతిక కార్యక్రమాలు.. తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమాలు.
    Summit
    Summit
  • సామాన్య ప్రజలు కూడా ఈ చారిత్రక కార్యక్రమాన్ని తిలకించేందుకు, ప్రభుత్వం కీలకమైన కేంద్రాల నుంచి ఉచిత బస్సు సేవలను ఏర్పాటు చేసింది.
  • ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్‌బీ నగర్ వంటి నగరంలోని ప్రధాన ట్రాన్స్‌పోర్ట్ హబ్‌ల నుంచి ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి.
  • వెళ్లేందుకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు..తిరిగి వచ్చేందుకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button