Sukumar:టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న సుకుమార్ శిష్యులు.. బాక్సాఫీస్ విజేత ఎవరు?
Sukumar: శ్రీకాంత్ ఓదెల, బుచ్చిబాబు సానా, కార్తీక్ దండు..ఈ ముగ్గురూ కూడా లెక్కల మాస్టర్ సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన వారేనన్న విషయం తెలిసిందే.
Sukumar
టాలీవుడ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్‌గా ముద్ర వేసుకున్న సుకుమార్(Sukumar).. కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, అద్భుతమైన దర్శకులను తయారు చేసే ఒక గొప్ప గురువు కూడా అని చాలా మందికి తెలీదు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన ముగ్గురు డైరెక్టర్లు ఇప్పుడు టాలీవుడ్ కమర్షియల్ ఫార్ములాను మార్చేస్తున్న పనిలో ఉన్నారు.
ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఆ ముగ్గురు దర్శకుల పేర్లే మార్మోగిపోతున్నాయి. శ్రీకాంత్ ఓదెల, బుచ్చిబాబు సానా, కార్తీక్ దండు..ఈ ముగ్గురూ కూడా లెక్కల మాస్టర్ సుకుమార్(Sukumar) స్కూల్ నుంచి వచ్చిన వారేనన్న విషయం తెలిసిందే. తాజాగా గురువు గారి ఇమేజును ఏమాత్రం తగ్గించకుండా.. తమ లేటెస్ట్ సినిమాల అప్డేట్స్తో నెట్టింట రికార్డులు క్రియేట్ చేస్తూ, సుకుమార్ శిష్యులా మజాకా అని అనిపించుకుంటున్నారు.
శ్రీకాంత్ ఓదెల గురించి చెప్పాలంటే ముందుగా దసరా మూవీ గుర్తుకు వస్తుంది. నానితో చేసిన తన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సుకుమార్ దగ్గర నాన్నకు ప్రేమతో.. రంగస్థలం వంటి సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ శ్రీకాంత్‌కు ఉంది.
ఇప్పుడు మళ్లీ నానితోనే చేస్తున్న.. ది పారడైజ్ సినిమా నుంచి వచ్చిన ఆయా షేర్.. సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అనిరుధ్ మ్యూజిక్, శ్రీకాంత్ టేకింగ్ చూస్తుంటే ఈ మూవీ మరో లెవల్లో ఉండబోతోందని అర్థమవుతోంది.
ఉప్పెన మూవీతో మెగా డెబ్యూ ఇచ్చి, ఫస్ట్ మూవీతోనే నేషనల్ అవార్డు అందుకున్న మరో డైరెక్టర్.. బుచ్చిబాబు సానా. ఈయన సుకుమార్(Sukumar) దగ్గర .. ఆర్య 2 నుంచి రంగస్థలం వరకు సుమారు అన్ని మూవీలకు రైటింగ్ టీమ్‌లో కీలక సభ్యుడిగా కొనసాగాడు. ఉప్పెన తర్వాత ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో ..పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
రీసెంట్గా ఈ సినిమా నుంచి వచ్చిన ..రయ్ రయ్ రారా సాంగ్‌లో రామ్ చరణ్ మాస్ విశ్వరూపం చూపించేలా చేశాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు విజన్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో నిలబెట్టబోతున్నాయి.

ఇక సుకుమార్ శిష్యుడు.. మూడో దర్శకుడు కార్తీక్ దండు. సాయి ధరమ్ తేజ్‌తో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ విరూపాక్షను అందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. కార్తీక్ కూడా సుకుమార్ దగ్గర చాలా కాలం పనిచేసి, స్క్రీన్ ప్లే మెలకువలు బాగానే నేర్చుకున్నాడు.
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో, వృషకర్మ.. అనే పీరియాడికల్ హారర్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్ చూసిన వారికి అసలు ఇది తెలుగు మూవీనా అనే అనుమానం వచ్చేలా విజువల్స్ ఉన్నాయి. అద్భుతమైన కంటెంట్‌తో వస్తున్న ఈ మూవీ చైతూ కెరీర్లోనే మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోందన్న టాక్ నడుస్తోంది.
సుకుమార్(Sukumar) నేర్పిన కంటెంట్ ఈజ్ కింగ్ అనే సూత్రాన్ని నమ్ముకుని ఈ ముగ్గురు దర్శకులు ముందుకు సాగుతున్నారు. విభిన్నమైన జోనర్లలో వీరు క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్‌తో.. ఈ ముగ్గురిలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని ఎవరు అందుకుంటారో చూడాలన్న క్యూరియాసిటీ పెరిగిపోతుంది.





