IPL 2026 auction: కోట్లు కొల్లగొట్టిన జమ్మూ యువ పేసర్.. ఎవరీ అకీబ్ నబీ దార్ ?
IPL 2026 auction: రంజీ ట్రోఫీలో ఐదు మ్యాచుల్లోనే 29 వికెట్లు , సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 15 వికెట్లతో దుమ్మురేపాడు.
IPL 2026 auction
ఐపీఎల్ వేలం(IPL 2026 auction) ఎప్పుడు జరిగినా విదేశీ స్టార్ ప్లేయర్స్ , భారత జట్టుకు ఆడిన మరకొందరు ప్లేయర్స్ పై కోట్ల వర్షం కురవడం కామన్ గా జరుగుతుంది. అదే సమయంలో అన్ క్యాప్డ్ ప్లేయర్స్ అంటే జాతీయ జట్టుకు ఆడని ప్లేయర్స్ కూడా కోట్లు కొల్లగొడుతుంటారు. దేశవాళీ క్రికెట్ లో అదిరిపోయే ప్రదర్శనలు చేసిన యువ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని మరింత అత్యుత్తమంగా వారిని తీర్చిదిద్దే పనిలో ఉంటాయి.
అందుకే దేశవాళీ క్రికెటర్లపైనా ఓ కన్నేసి ఉంచుతాయి. ఈ సారి మినీ వేలంలో జమ్మూ కాశ్మీర్ యువ పేసర్ అకీబ్ నబీ దార్ జాక్ పాట్ కొట్టాడు. ముందు నుంచీ ఈ జమ్మూ పేసర్ మీద భారీ అంచనాలున్నాయి. దీనికి కారణం దేశవాళీ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లలో అద్భుతమైన రికార్డు ఉండడమే. ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ నిలకడగా రాణిస్తూ ఫ్రాంచైజీలను ఆకర్షించాడు.
రంజీ ట్రోఫీలో ఐదు మ్యాచుల్లోనే 29 వికెట్లు , సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 15 వికెట్లతో దుమ్మురేపాడు. వేలంలోకి రాగానే ఢిల్లీ క్యాపిటల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ యువ పేసర్ కోసం నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. షమీ స్థానంలో మంచి పేసర్ కోసం చూస్తున్న సన్ రైజర్స్ చివరి వరకూ ప్రయత్నించింది. బిడ్డింగ్ పెరుగుతూ పోవడంతో చివరికి ఢిల్లీ 8.40 కోట్లకు అకీబ్ నబీ దార్ ను దక్కించుకుంది.

జమ్మూ & కాశ్మీర్ కు చెందిన అకీబ్ నబీ దార్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ ప్రదర్శనలతో పేరు తెచ్చుకున్నాడు, స్వింగ్ బౌలింగ్ , ఆల్-రౌండ్ నైపుణ్యాలతో ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. మంచి స్వింగ్ బౌలింగ్ చేయడం, ముఖ్యంగా కొత్త బంతితో బాగా రాణించడం అతని స్పెషాలిటీ. టెయిలెండర్ల స్థానాల్లో అప్పుడప్పుడు మంచి ఇన్నింగ్స్ లు ఆడడం కూడా అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.
వేలాని(IPL 2026 auction)కి ముందు నుంచే చెన్నై, ఢిల్లీ, సన్ రైజర్స్ ఈ యువ పేసర్ పై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూడు జట్లకు యువ పేసర్ అవసరం ఉండడంతో వేగంతో బౌలింగ్ చేసే ఆప్షన్ గా అకీబ్ దార్ ముందు వరుసలో నిలిచాడు. అయితే మినీ ఆక్షన్ లో చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని దక్కించుకుంది. దీంతో 30 లక్షల బేస్ ప్రైస్ తో వచ్చి కోట్లు కొల్లగొట్టిన అకీబ్ దార్ ఐపీఎల్ 2026 సీజన్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.



