IND vs SA: సిరీస్ విజయంపై భారత్ కన్ను.. లక్నో వేదికగా నాలుగో టీ20
IND vs SA: కెప్టెన్ మార్ క్రమ్ తప్పిస్తే మిగిలిన వారంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. హర్షిత్ రాణా, అర్షదీప్ తో పాటు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి కూడా నఫారీలను దెబ్బకొట్టారు.
IND vs SA
సౌతాఫ్రికాపై టీ ట్వంటీ సిరీస్ (IND vs SA)విజయానికి భారత్ చేరువైంది. లక్నో వేదికగా జరగబోయే నాలుగో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మూడో మ్యాచ్ (IND vs SA)లో పూర్తిగా ఆధిపత్యం కనబరిచిన టీమిండియా అదే జోరు కొనసాగించాలని ఎదురుచూస్తోంది. గత మ్యాచ్ లో బౌలర్లు చెలరేగిపోయారు. సమిష్టిగా రాణించిన పేనర్లు, స్పిన్నర్లు సౌతాఫ్రికా బ్యాటర్లను క్రీజుతో కుదురుకోనివ్వలేదు.
కెప్టెన్ మార్ క్రమ్ తప్పిస్తే మిగిలిన వారంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. హర్షిత్ రాణా, అర్షదీప్ తో పాటు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి కూడా నఫారీలను దెబ్బకొట్టారు. అటు ఆల్ రౌండర్లు పాండ్యా, దూబే సైతం తలో చేయి చేయడంతో సౌతాఫ్రికా 117 పరుగులకే కుప్పకూలింది. అటు బ్యాటింగ్ అభిషేక్ శర్మ ఫామ్ అందుకున్నప్పటకీ.. గిల్ పర్వాలేదనిపించాడు.
అయితే టీ20 ఫార్మాట్ కు తగ్గట్టు రాణించలేదన్న విమర్శలున్నాయి. ఇక నూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ మాత్రం కంటిన్యూ అవుతూ ఉంది. వరల్డ్ కప్ కు ముందు ఇంకా కొన్ని మ్యాచ్ లే మిగిలి ఉన్న నేపథ్యంలో భారత కెప్టెన్, వైస్ కెప్టెన్ పేలవ ఫామ్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత సిరీస్ లో మిగిలిన రెండు మ్యాచ్ లోనైనా వీరిద్దరూ ఫామ్ అందుకోవాలని టీమ్ మేనేజిమెంట్ భావిస్తోంది.

సిరీస్ (IND vs SA)గెలువుపై కన్నేసిన నేపథ్యంలో నాలుగో టీ20లో విజయానికి అందరూ కలిసికట్టుగా రాణించాల్సిన అవసరం ఉంది. తుది జట్టు మార్పుల విషయానికొస్తే సేమ్ కాంబినేషన్ తోనే బరిలోకి దిగనుంది. అక్షర్ పటేల్ సిరీస్ మొత్తానికీ దూరమవగా, బుమ్రా వ్యక్తిగత కారణాలతో జట్టును వీడాడు. మళ్లీ వచ్చి జట్టుతో కలుస్తాడా లేదా అన్నది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో భారత్ మూడో టీ ట్వంటీ ఆడిన జట్టుతోనే ఆడనుంది. దీంతో నంజూ శాంసన్ కు మరోసారి నిరాశే మిగనుంది.
ఇదిలా ఉంటే బ్యాటర్లు మాత్రం నిలకడగా సాధించాల్సిన అవసరమైతే ఉంది. అభిషేక్ శర్మ, గిల్ నుంచి మరింత మెరుగైన ఆరంభాలను టీమ్ ఆశిస్తోంది. అలాగే ఫినిషర్ రోల్ లో జితేశ్ శర్మకు కూడా ఈ సిరీస్ మంచి ఛాన్స్. ఇదిలా ఉంటే ప్రపంచకప్ కు ముందు ఇక ప్రయోగాలకు చెక్ పెట్టాలని పలువురు నూచిస్తుండడంతో బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు జరిగే అవకాశాలు లేవు.
మరోవైపు మూడో టీ20 ఘోరపరాజయం నుంచి కోలుకుంటున్న సౌతాఫ్రికా సిరీస్ నమం చేయాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ లో బ్యాటర్ల వైఫల్యం జట్టు ఓటమికి కారణం. మార్క్ క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడకుంటే కనీసం వంద కూడా చేసేది కాదు. డీ ఓపెనర్లు డికాక్, హెండ్రిక్స్ పై ఒత్తిడి కనిపిస్తోంది. అలాగే మిల్లర్, బ్రెవిన్ నుంచి టీమ్ మేనేజ్ మెంట్ మెరుపు ఇన్నింగ్స్ లు ఆశిస్తోంది. ఇక బౌలింగ్లో ఎంగిడి, యెన్సన్, నోర్జేలపై అంచనాలున్నాయి.



