Lying: ఎదుటివారు అబద్ధాలు చెబుతున్నారని కనిపెట్టడం ఎలా? సైకాలజీ చెప్పే 5 సీక్రెట్స్!
Lying: వరైనా మీతో అబద్ధం చెబుతున్నప్పుడు వారి మాటల్లో కాకుండా, వారి ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తాయని సైకాలజిస్టులు చెబుతున్నారు.
Lying
మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అబద్ధం (Lying)చెప్పక తప్పదు. కానీ కొందరు తమ స్వార్థం కోసం, మన నుంచి నిజాల్ని దాచి నిజాయితీగా ఉంటున్నామని చెప్పడానికి అబద్ధాలు చెబుతుంటారు. అయితే ఎవరైనా మీతో అబద్ధం చెబుతున్నప్పుడు వారి మాటల్లో కాకుండా, వారి ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. వారు చెబుతున్నదాని ప్రకారం, ఎదుటివారు అబద్ధం చెబుతున్నారని కనిపెట్టడానికి ఈ 5 సీక్రెట్స్ మీకు బాగా ఉపయోగపడతాయి.
కళ్ల కదలికలు (Eye Contact).. సాధారణంగా ఎవరైనా అబద్ధం చెప్పేటప్పుడు కళ్లలోకి కళ్లు పెట్టి చూసి మాట్లాడలేరు. అయితే మరికొందరు మాత్రం తాము అబద్ధం చెబుతున్నట్లు ఎవరికీ తెలియకూడదని కావాలనే ఎక్కువ సేపు కళ్లలోకి చూస్తూ ఉంటారు. అంటే నార్మల్ కంటే ఎక్కువ సేపు వారు ఐ కాంటాక్ట్ ఇస్తున్నారంటే వారు ఏదో కవర్ చేస్తున్నారని అర్థం. అలాగే వారు పదే పదే కనురెప్పలు ఆడిస్తుంటారట.
బాడీ లాంగ్వేజ్ లో మార్పులు..అంతేకాదు అబద్ధం (Lying)చెప్పేటప్పుడు మనిషి మెదడు ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల తెలియకుండానే చేతులు నలుపుకోవడం, జుట్టు సవరించుకోవడం, ముక్కును పదే పదే తాకడం వంటివి చేస్తుంటారు. అంటే అబద్ధం ఆడినపుడు వారి బాడీలో ఒక రకమైన అసౌకర్యం (Restlessness) కనిపిస్తుంది.

అనవసరమైన వివరణలు..మీరు వారిని ఒక చిన్న ప్రశ్న అడిగితే, వారు అడగని విషయాలను కూడా కలిపి చాలా పెద్దగా వివరణ ఇస్తుంటారు. అబద్ధాన్ని నిజం అని నమ్మించడానికి వారు ఇలా ఎక్కువ సమాచారాన్ని జోడిస్తారు. అలాగే వారు చెప్పే కథలో లాజిక్ మిస్ అవుతూ ఉంటుందన్న విషయం వారు గుర్తించలేరు.
గొంతులో మార్పు (Pitch of Voice).. అబద్ధం(Lying) చెప్పేటప్పుడు కొందరిలో గొంతు కొంచెం వణుకుతుంది లేదా స్వరం మారుతుంది. కొందరు చాలా వేగంగా మాట్లాడి ఆ టాపిక్ ని ముగించడానికి వీలయితే టాపిక్ డైవర్ట్ చేయడానికి చూస్తారు. మరికొందరు మధ్యమధ్యలో ఆగుతూ, ఆలోచిస్తూ మాట్లాడుతారు.
ప్రశ్నను మళ్లీ అడగడం..మీరు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు,వారికి ఆలోచించి సమాధానం చెప్పడానికి సమయం కావాలి కాబట్టి.. వారు మీరు అడిగిన ప్రశ్ననే మళ్లీ రిపీట్ చేస్తారు. లేదా నిజంగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా, నీ నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురవుతుందని అనుకోలేదు నన్నెందుకు నమ్మడం లేదు, అని ఎదురుదాడి చేస్తారు. లేదంటే సెంటిమెంట్‌తో మిమ్మల్ని బురిడీ కొట్టించడానికి చూస్తారు. సో..ఇలాంటి సంకేతాలను గమనిస్తే, ఎదుటివారు నిజాయితీగా ఉన్నారో లేదో మీరు ఈజీగా పసిగట్టొచ్చు.


