Just EntertainmentLatest News

Ustaad Bhagat Singh:పూనకాలు తెప్పిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్

Ustaad Bhagat Singh: ఉగాది పండుగ కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్‌లో రిలీజ్ చేయడానికి మూవీ యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)కోసం అభిమానులు.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరీశ్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీనిలో పవన్ కళ్యాణ్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఉగాది పండుగ కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్‌లో రిలీజ్ చేయడానికి మూవీ యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

ఇక ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో మూవీ యూనిట్ స్పీడ్ పెంచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, దానికి అభిమానుల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది.

ఒక పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్ లాస్ట్ వరకూ క్యూరియాసిటీని పెంచేస్తోంది. ముఖ్యంగా వైలెన్స్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్.. ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.దీనికి తోడు పవన్ మార్కు మేనరిజమ్స్, యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ ట్రైలర్ చూశాక మూవీపై అంచనాలు ఒక్కసారిగా పీక్స్‌కు వెళ్లిపోయాయి.

హరీశ్ శంకర్ మార్క్ డైలాగ్స్ ఈ మూవీకి పెద్ద ప్లస్ కానున్నాయని అర్థమవుతోంది. సంతోషంగా ఉండడమంటే మన లైఫ్ మనకు నచ్చడం, అంతేకానీ మనకు ఎవరో లైక్స్ కొట్టడం కాదంటూ రాశీ ఖన్నాతో పవన్ కళ్యాణ్‌ చెప్పే డైలాగ్ ట్రైలర్‌లోనే హైలైట్‌గా నిలుస్తోంది.

ఇక క్లైమాక్స్‌లో అయితే ఇచ్చిపడేసే గోత్రం- ఇరగదీసే నక్షత్రం అంటూ పవర్ స్టార్ చెప్పిన వాయిస్ వింటే థియేటర్లలో విజిల్స్ గ్యారెంటీ అనిపిస్తుంది. అంతేకాదు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం డ్యాన్స్ అంటూ కాస్త కామెడీ టచ్‌ను కూడా పవన్ యాడ్ చేయడంతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.

మరోవైపు ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మార్చి 19న ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ మెమోను కూడా జారీ చేసింది. ఈ బెనిఫిట్ షో టికెట్ ధరను 500 రూపాయలుగా నిర్ణయించారు.

అంతేకాకుండా,మూవీ రిలీజయ్యాక ఫస్ట్ పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. దీని ప్రకారం మార్చి 19 నుంచి 28 వరకు సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 125 రూపాయల వరకు టికెట్ ధరలు పెరగబోతున్నాయి..

Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh

హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ కలయికలో 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సృష్టించిన సెన్సేషన్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, మేనరిజమ్స్ తో ఈ మూవీ పక్కాగా బ్లాక్ బస్టర్ అవుతుందని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది.

మరోవైపు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించడానికి మూవీ యూనిట్ రెడీ అయింది. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో మార్చి 15న, ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

అయితే ఈ భారీ ఈవెంట్‌కు ఎక్కువ సంఖ్యలో అభిమానులు,జనసైనికులు హాజరయ్యే అవకాశం ఉండటంతో, వేదిక వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మూవీకి మరింత హైప్ క్రియేట్ చేస్తుందని మూవీ యూనిట్ భావిస్తోంది. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)మూవీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ షురూ చేశారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button