Defeat:ప్రతి ఓటమి ఒక కొత్త పాఠమే.. కుంగిపోకుండా నిలబడటం ఎలా?
Defeat: ఓడిపోవడం అంటే పడిపోవడం కాదు, పడిపోయిన చోటే ఉండిపోవడమే నిజమైన ఓటమి.
Defeat
మన జీవిత ప్రయాణంలో గెలుపోటములు చాలా సహజం. కానీ చాలా మంది ఏదైనా చిన్న సమస్య ఎదురైనా లేదా అనుకున్న పని అనుకున్నట్లు జరగకపోయినా చాలా డిజప్పాయింట్ అవుతుంటారు. జీవితం ఇక్కడితో ముగిసిపోయిందని, ఇక దేనికీ పనికిరామని తమను తాము తక్కువ చేసుకుంటారు.
నిజానికి ఓటమి(Defeat) అనేది ఒక ముగింపు కాదు, అది మనం ఎక్కడ తప్పు చేశామో సరిదిద్దుకోవడానికి మనకు ఇచ్చే ఒక అద్భుతమైన ఛాన్స్. చీకటి తర్వాతే వెలుగు వచ్చినట్లు, ప్రతి పెద్ద విజయం వెనుక అంతకంటే పెద్ద ఓటమి దాగి ఉంటుంది అలాగే ఓటమి వెనుక విజయం దాగుంటుందనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనసులోని సంకల్ప బలం బలంగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించి మళ్లీ ఫీనిక్స్ పక్షిలా పైకి లేవచ్చని చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
ఓడిపోవడం అంటే పడిపోవడం కాదు, పడిపోయిన చోటే ఉండిపోవడమే నిజమైన ఓటమి. మీరు ఏదైనా పరీక్షలో ఫెయిల్ అయినా, వ్యాపారంలో నష్టపోయినా, పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు పడుతున్నా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.
ఈ లోకంలో ఏ విజయమూ, ఓటమి శాశ్వతం కాదు. మీరు పడ్డ కష్టం, మీరు చేసిన పోరాటం ఎప్పటికీ వృధా పోదు. ఈరోజు ఓటమి మిమ్మల్ని మరింత అనుభవజ్ఞుడిగా మారుస్తుంది. ఏఏ తప్పులు చేస్తే ఓటమి ఎదురైందో విశ్లేషించుకుని, రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టాలి. ప్రయత్నం ఆపివేసిన రోజే మనిషి నిజంగా ఓడిపోతాడు, అప్పటివరకు ప్రతి అడుగు ఒక పాఠమే అన్న విషయం తెలుసుకోవాలి.
కష్టకాలంలో మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని రకరకాలుగా విమర్శించొచ్చు. మన చేతకానితనాన్ని వేలెత్తి చూపొచ్చు. కానీ ఆ విమర్శలను పట్టించుకోకుండా మనపై మనకు నమ్మకం ఉండటం చాలా ముఖ్యం. మనల్ని మనమే నమ్మనప్పుడు ఈ ప్రపంచం మనల్ని ఎలా నమ్ముతుంది అని ప్రశ్నించుకోవాలి.

నిజం చెప్పాలంటే కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడే మనలోని అసలైన శక్తి బయటకు వస్తుంది. అప్పుడు నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లాలి. మీ విజయం ప్రపంచానికి వినిపించేలా చేయాలి. ఓటమి(Defeat) ఎదురైనప్పుడు ఏడవడం కంటే, ఆ ఓటమికి కారణమైన లోటుపాట్లను వెతికి వాటిని బలంగా మార్చుకోవడంలోనే అసలు కిక్కు ఉంటుంది. ఓటమి అనేది మనల్ని బలహీనపరచడానికి రాదు, మనలోని బలమేంటో మనకు చూపించడానికి వస్తుంది.
జీవితంలో ఒక్క తలుపు మూసుకుపోతే ఇంకో తలుపు తెరుచుకుంటుంది. మనం మూసుకుపోయిన ఆ ఒక్క తలుపు వైపే చూస్తూ కూర్చుంటే, తెరుచుకున్న మిగతా అవకాశాలను గమనించలేం. గతాన్ని తలుచుకుంటూ బాధపడటం మానేసి, వర్తమానంలో ఏం చేయగలమో ఆలోచించాలి. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశమే.. నిన్న తప్పులను ఈరోజు చేయకుండా జాగ్రత్త పడితే, రేపు విజయం మీ సొంతం అవుతుంది.
నిజానికి ఓటమి(Defeat)ని గౌరవించాలి. ఎందుకంటే అది మీకు జీవిత పాఠాలను నేర్పిస్తుంది. కుంగిపోవడం మాని, గర్వంగా తలెత్తుకుని మళ్లీ నడవడం మొదలుపెట్టాలి. విజేతలు ఎప్పుడూ ఆకాశం నుంచి ఊడిపడరు, వారు కూడా మీలాగే ఎన్నోసార్లు ఓడిపోయి, ఆ ఓటములను ఎదిరించి నిలబడిన సామాన్యులే అని తెలుసుకోవాలి.
జీవితం ఒక నిరంతర పోరాటం. ఇందులో గెలుపు ఎంత మధురంగా ఉంటుందో, ఓటమి అంతకంటే పదునుగా మనల్ని తీర్చిదిద్దుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మీరు పడుతున్న కష్టం, పడుతున్న బాధ అంతా ఒక రోజు తీరిపోతుంది. ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు పడ్డ ఈ కష్టాలే మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా మార్చాయని మీకే అర్థమవుతుంది. కాబట్టి అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి.


