Just NationalLatest News

bullet train: బుల్లెట్ ట్రైన్ వచ్చేది అప్పుడే..  రైల్వే మంత్రి కీలక ప్రకటన

bullet train: ఒకవేళ 12 స్టేషన్లలో ఆగితే.. 2 గంటల 17 నిమిషాల వరకూ సమయం పడుతుంది. ఇప్పటికే 330 కిలో మీటర్ల మేర వయాడక్ట్ నిర్మాణం పూర్తయిందనీ నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ వెల్లడించింది.

bullet train

పలు దేశాల్లో దూసుకెళుతున్న బుల్లెట్ ట్రైన్ (bullet train)భారతీయుల ముందుకు రాబోతోంది. ఎంతోకాలంగా భారత ప్రజలు ఎదురుచూస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ బుల్లెట్ రైలు వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చేస్తోంది. దీనినై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఆగష్టు 15న ఈ హైస్పీడ్ రైలు ప్రారంభోత్సవం జరుపుకోనుంది. జపాన్‌కు చెందిన అత్యాధునిక షింకన్‌సేన్ టెక్నాలజీతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తే భారత ప్రయాణ ముఖచిత్రం మారిపోతుందని భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో బుల్లెట్ ట్రైన్స్ (bullet train)దూసుకెళుతున్నాయి. ఆసియా దేశాల్లో చైనా, జపాన్ , సౌత్ కొరియా, తైవాన్ , సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియాలో ఇప్పటికే సేవలందిస్తున్నాయి. ప్రాంతాల మధ్య ప్రయాణ దూరసమయం ఈ బుల్లెట్ రైలుతో బాగా తగ్గిపోతుంది. అటు స్పెయిన్, ఫ్రాన్స్ , జర్మనీ, రష్యా, పోర్చుగల్, స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ దేశాల్లోనూ బుల్లెట్ ట్రైన్స్(bullet train) ప్రజారవాణాలో కీలకంగా మారిపోయాయి.

ఇప్పుడు భారత్ లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య508 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టును ప్రభుత్వం దశలవారీగా ప్రారంభించనుంది. మొదటి దశలో గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా మధ్య 47 కిలోమీటర్ల మేర మొదటి బుల్లెట్ రైలు పరుగులు తీయబోతోంది. తర్వాత వాపి-సూరత్, వాపి – అహ్మదాబాద్ మార్గాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. థానే, అహ్మదాబాద్ మార్గం పూర్తయ్యాక, చివరగా ముంబై, అహ్మదాబాద్ పూర్తి కారిడార్ అనుసంధానిస్తారు.

bullet train
bullet train

గంటకు గరిష్టంగా 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించడమే బుల్లెట్ ట్రైన్(bullet train) ప్రత్యేకత. సాధారణంగా ముంబై , అహ్మదాబాద్ మధ్య రైలు ప్రయాణానికి 7 గంటల పైనే టైమ్ పడుతుంది. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వచ్చే ఈ సమయం భారీగా తగ్గిపోతుంది. కేవలం 4 స్టేషన్లలో ఆగితే 2 గంటల్లోనే ఈ దూరాన్ని చేరుకోవచ్చు.

ఒకవేళ 12 స్టేషన్లలో ఆగితే.. 2 గంటల 17 నిమిషాల వరకూ సమయం పడుతుంది. ఇప్పటికే 330 కిలో మీటర్ల మేర వయాడక్ట్ నిర్మాణం పూర్తయిందనీ నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ మార్గంలో17 నదీ వంతెనలు పూర్తయ్యాయి. సూరత్ స్టేషన్ నిర్మాణాన్ని వజ్రాల పరిశ్రమ థీమ్‌తో అత్యద్భతంగా రూపొందిస్తున్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రూ. 85 వేల కోట్ల వరకూ వెచ్చించినట్టు మంత్రి తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button