HealthJust LifestyleLatest News

Mood swings:మహిళలలో మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయి? ఆ సమయంలో ఇంట్లో వాళ్లు వారితో ఎలా ఉండాలి?

Mood swings : పీరియడ్స్ సమయంలో పైకి కనిపించే ఐదు రోజుల ప్రయాణం.. కొందరికి సాఫీగా సాగిపోవచ్చు కానీ, మరికొందరికి అది మౌనంగా భరించే ఒక నరకం అనే చెప్పాలి.

Mood swings

పీరియడ్స్ సమయంలో పైకి కనిపించే ఐదు రోజుల ప్రయాణం.. కొందరికి సాఫీగా సాగిపోవచ్చు కానీ, మరికొందరికి అది మౌనంగా భరించే ఒక నరకం అనే చెప్పాలి. పీరియడ్స్ అంటే కేవలం శరీరం నుంచి వచ్చే బ్లీడింగ్ మాత్రమే కాదు. పీరియడ్స్ అంటే కణకణాన్ని మెలిపెట్టే శారీరక వేదన, మనసును అతలాకుతలం చేసే హార్మోన్ల అలజడి అని చాలామందికి తెలియదు.

ఎంతటి విజ్ఞత ఉన్న మహిళనైనా ఒక పసిబిడ్డలా మార్చేసే ఈ సమయం ..నిజంగా ఆమె సహనానికి ప్రకృతి పెట్టే కఠిన పరీక్షగా మారిపోతుంది. పీరియడ్స్ సమయంలో అమ్మాయిల ప్రవర్తనలో వచ్చే మార్పుల వెనుక బలమైన శారీరక, హార్మోన్ల కారణాలు ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. ఇది కేవలం మానసికమైన విషయం కాదు, ఇది పూర్తిగా ఒక బయోలాజికల్ ప్రాసెస్‌ అని చెబుతున్నారు.

పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందు నుంచి బాడీలో ..ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ల స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. దీంతో మెదడులోని సెరోటోనిన్.. (మనల్ని సంతోషంగా ఉంచే హార్మోన్) కూడా ఒక్కసారిగా తగ్గిపోతుంది. దీనివల్ల తెలీకుండానే విపరీతమైన కోపం, చిరాకు, అకారణంగా ఏడుపు రావడం వంటి మూడ్ స్వింగ్స్ (Mood swings)వస్తాయి. అంతెందుకు ఎంత మెచ్యూరిటీ ఉన్న మహిళ అయినా, తన కంట్రోల్‌లో లేని ఈ హార్మోన్ల మార్పుల వల్ల ఒక్కోసారి చిన్న పిల్లలా మారిపోతుంది.

పీరియడ్స్ సమయంలో మహిళలకు కేవలం మూడ్ స్వింగ్స్(Mood swings) మాత్రమే కాదు, శారీరకంగా విపరీతమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, నీరసం , రొమ్ముల నొప్పి వంటివి కూడా ఉంటాయి. శరీరం ఇంత ఒత్తిడిలో ఉన్నప్పుడు.. వారికి తెలియకుండానే తమకు కావాల్సిన వారి దగ్గర నుంచి భద్రతను, ప్రేమను కోరుకుంటారు. చిన్న విషయానికే అలగడం, మొండిగా ప్రవర్తించడం చేస్తున్నారంటే అది వారు చేస్తుంది కాదు.. వారి శరీరంలోని అలజడి చేయిస్తుందని అర్ధం చేసుకోవాలి.

Mood swings
Mood swings

ఈ సమయంలో ఇంట్లో వాళ్లు వారిని బాగా అర్థం చేసుకోవాలి. వారు చిరాకుగా మాట్లాడినప్పుడు మీరు ఎదురుదాడి చేయకుండా శాంతంగా ఉండాలి. ఆ పరిస్థితి కేవలం 3-4 రోజులు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.
ఆ సమయంలో వారికి బాగా నీరసంగా ఉంటుంది కాబట్టి, ఇంట్లో పనులు పంచుకోవడం, ఆఫీసుకు వెళ్లేవారు అయితే వారిని కనీసం ఆ ఒక్కరోజయినా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొమ్మని చెప్పడం  చేయాలి.

ప్రేమగా పలకరిస్తూ..నీకు ఏమైనా కావాలా? నేను ఏం చేయగలనని అడగడం వారికి కొండంత అండగా ఉంటుంది. వారికి నచ్చిన ఆహారం అందించడం, తగినంత విశ్రాంతి తీసుకునేలా చూడటం చాలా ముఖ్యం. డార్క్ చాక్లెట్స్, వేడి పానీయాలు వారి మూడ్ మెరుగుపరచడానికి సాయపడతాయి.

మహిళలకు మూడ్ స్వింగ్స్ (Mood swings) ఆ టైమ్‌లో కావాల్సింది తర్కం (Logic) కాదు, కేవలం మీ ప్రేమ , తోడు మాత్రమే అని మీరు అర్ధం చేసుకోవాలి. అది ఏ అడ్రస్ లేని కోపం కాదని.., కేవలం శరీరం పడుతున్న ఇబ్బందికి అది ఒక నిరసన మాత్రమేనని తెలుసుకోవాలి. ఈ సమయంలో వారిని అర్థం చేసుకోవడం అంటే.. ఆ ఇంటి గౌరవాన్ని పెంచడమే అని గుర్తించాలి.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button