IPL : బంగ్లా ప్లేయర్స్ పై ఐపీఎల్ బ్యాన్
IPL : ముస్తఫిజుర్ ను రిలీజ్ చేసిన కేకేఆర్
IPL
ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్న కోల్ కత్తా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రహమాన్ ను వదిలేయాలని బీసీసీఐ ఆ ఫ్రాంచైజీకి ఆదేశాలిచ్చింది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, వరుస హత్యల పరిణామాలతో బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది చివర్లో జరిగిన వేలంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ముస్తఫిజుర్ ను రూ.9.2 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన ఈ బంగ్లా పేసర్ కోసం ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి కొనుగోలు చేసింది. అతని రాకతో కోల్ కత్తా పేస్ బలం కూడా పెరిగింది. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ముస్తఫిజర్ సేవలను కోల్పోయింది. గత కొంతకాలంగా బంగ్లాలో పరిస్థితులు ఏ మాత్రం బాగాలేవు. హిందువులపై ఘోరమైన దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ నలుగురు హిందువులు అక్కడి అల్లరిమూకల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.

ఈ పరిణామాలతో ఐపీఎల్ ( IPL ) ఫ్రాంచైజీలు, బీసీసీఐపై రాజకీయ నేతలు విమర్శలు గుప్పించారు. ముస్తఫిజర్ ను ఐపీఎల్ ఆడేందుకు అనుమతించవద్దని డిమాండ్ చేశారు. అతన్ని ఆడిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హిందూ సంఘాలు హెచ్చరించాయి. కోల్ కత్తాలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని కూడా కొందరు బీజేపీ నేతలు వార్నింగ్ ఇవ్వడంతో కలకలం రేగింది. పనిలో పనిగా మతపరమైన సంస్థలు కోల్ కత్తా ఓనర్ షారూఖ్ ఖాన్ ను టార్గెట్ చేశాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ బంగ్లా ప్లేయర్ విషయంలో పునరాలోచించింది.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కఠిన నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు కోల్ కత్తా ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఆదేశాలిచ్చింది. పరిస్థితి చేయిదాటకముందే అతన్ని తప్పిస్తేమంచిదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా వెల్లడించారు. అతని స్థానంలో మరొక ప్లేయర్ ను భర్తీ చేసుకునేందుకు కేకేఆర్ కు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. అయితే ఆటపరంగా చూస్తే మాత్రం ముస్తఫిజర్ లేకపోవడం కోల్ కత్తాకు ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఎందుకంటే స్లో పిచ్ లపై తన వేరియేషన్లతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడం చాలా సార్లు చూసాం. దీంతో అతని స్థానాన్ని రీప్లేస్ చేసేలా సరైన ఆటగాడిని వెతుక్కోవడం కోల్ కత్తాకు ఇప్పుడు సవాలే. ముస్తఫీజర్ ఐపీఎల్ లో ఇప్పటి వరకూ 60 మ్యాచ్ లు ఆడి 65 వికెట్లు పడగొట్టాడు.
IPL 2026 Auction: మినీ వేలానికి వేళాయె.. జాక్ పాట్ కొట్టేదెవరో ?




One Comment