IPL 2026 Auction: మినీ వేలానికి వేళాయె.. జాక్ పాట్ కొట్టేదెవరో ?
IPL 2026 Auction: వీరిలో కొందరిని గతంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు ఇప్పుడు వేలంలోకి వదిలేసే తక్కువ ధరకు దక్కించుకోవాలని కూడా చూస్తున్నాయి.
IPL 2026 Auction
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ఆటగాళ్ల వేలానికి సైతం అంతే ఆనక్తి కనబరుస్తుంటారు. ఎందుకంటే ఏ ప్లేయర్ కు జాక్ పాట్ తగులుతుందో, ఎవరు ఎంత భారీ ధరకు అమ్ముడవుతారో, ఎవరు అమ్ముడవకుండా మిగిలిపోతారో వంటి అంశాలు ఉత్కంఠ రేకెత్తిస్తుంటాయి. ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్ కోసం మినీ వేలాని(IPL 2026 Auction)కి అంతా సిద్ధమైంది.
అబుదాబీ వేదికగా మంగళవారం మినీ ఆక్షన్ జరగబోతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు చాలా మంది ప్లేయర్స్ ను వేలం(IPL 2026 Auction)లోకి రిలీజ్ చేసి, తమ కాంబినేషన్ కు తగ్గట్టుగా కీటక ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఇప్పుడు టీమ్ లో మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 1355 మంది ప్లేయర్స్ తమ పేర్లు రిజిస్టర్ చేసుకోగా.ఫ్రాంచైజీలతో చర్చించిన తర్వాత 359 మందిని బీసీసీఐ పార్ట్ లిస్ట్ చేసింది. వీరిలో భారత్ నుంచి 244 ముంది, విదేశీ ప్లేయర్స్ 115 మంది ఉన్నారు.
ఈ జాబితాలో 112 నుండి క్యాప్డ్ ప్లేయర్స్ (జాతీయ జట్టుకు ఆడినవారు), 238 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్స్ (జాతీయ జట్టుకు ఆడనివారు) ఉన్నారు. 10 ప్రాంచైజీలలో కలిపి 77 ఖాళీలే ఉండగా.. రూ.237.55 కోట్లు ఖర్చు చేయొచ్చు. వేలానికి ముందు అన్ని జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. అయితే మినీ వేలంలో కూడా పలువురు స్టార్ ప్లేయర్స్ ఉన్నారు.

కామెరూన్ గ్రీన్, వెంకటేశ్ అయ్యర్, రవి బిష్ణోయ్, డేవిడ్ మిల్లర్, మహేశ్ తీక్షణ, పతిరణ, కాన్వే వంటి ప్లేయర్స్ భారీ ధర పలికే అవకాశముంది. వీరిలో కొందరిని గతంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు ఇప్పుడు వేలంలోకి వదిలేసే తక్కువ ధరకు దక్కించుకోవాలని కూడా చూస్తున్నాయి.
మినీ వేలం(IPL 2026 Auction)లో రూ.2 కోట్లు, రూ.1.5 కోట్లు, రూ.1.25 కోట్లు, రూ. కోటి, రూ.75 లక్షలు, రూ.50 లక్షలు, రూ.40 లక్షలతో పాటు రూ.30 లక్షల బేన్ ప్రైస్ తో ఆటగాళ్లు ఉన్నారు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ జాబితాలో 40 మంది ప్లేయర్స్ ఉండగా రూ.1.5 కోట్ల బేన్ ప్రైస్ తో 9 మంది వేశంలో నిలిచారు. రూ.1.25 కోట్ల కనీస ధరతో నలుగురు, కోటి రూపాయల బేస్ ప్రైస్ తో 17 మంది వేలంలో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఫ్రాంచైజీల మనీ పర్స్ విషయానికొస్తే కోల్ కత్తా నైట్ రైడర్స్ అత్యధికంగా రూ.64.3 కోట్లతో వేలానికి సిద్ధమైంది. ముంబై ఇండియన్స్ అత్యల్పంగా రూ.2.75 కోట్లతో వేలం బరిలో నిలిచింది.మినీ వేలం కావడంతో మర్కీ ప్లేయర్స్ సెట్ ఉండదు. వేలం క్యాప్డ్ బ్యాటర్స్ కేటగిరీలో మొదలవుతుంది. ఈ సెట్ లో కామెరూన్ గ్రీన్, ఫ్రేజర్ మెక్ గర్క్, మిల్లర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు. తొలి రౌండ్ లో అమ్ముడుపోని ప్లేయర్స్ ను చివర్లో యాక్సిలిరేటెడ్ రౌండ్ లో మరోసారి వేలం వేస్తారు.



