just AnalysisJust InternationalLatest News

Nestle:నెస్లే బేబీ ఫుడ్‌లో విషం.. 31 దేశాల్లో ఉత్పత్తుల వెనక్కి.. భారత్‌లో పరిస్థితి ఏంటి?

Nestle: అసలు నెస్లే బేబీ ఫుడ్‌ ప్రొడెక్ట్స్ రీకాల్ వెనుక ఉన్న భయంకరమైన కారణం ..సెరియులైడ్ అనే టాక్సిన్ అని తెలుస్తోంది.

Nestle

ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తల్లులు కళ్లు మూసుకుని నమ్మే ఒకే ఒక్క పేరు నెస్లే (Nestle). పసిబిడ్డలకు తల్లి పాలు చాలనపుడో, లేదా ప్రత్యామ్నాయంగా ఏది ఇవ్వాలని ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే బ్రాండ్ ఇది. కానీ ఇప్పుడు అదే నెస్లే సంస్థ తన చరిత్రలోనే ఎప్పుడూ లేనంత పెద్ద సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి తలెత్తింది

స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ ఆహార దిగ్గజం, తన ఫేమస్ బేబీ ఫుడ్ ఉత్పత్తులైన ఎస్ఎంఏ (SMA), నాన్ (NAN), బెబా (BEBA) వంటి కొన్ని బ్యాచ్‌లను గ్లోబల్ మార్కెట్ నుంచి అత్యవసరంగా వెనక్కి తీసుకోవడం (రీకాల్) అంతర్జాతీయ స్థాయిలో ఒక పెను ఉప్పెనను సృష్టిస్తోంది. అయితే ఇది కేవలం ఒక వ్యాపార పరమైన తప్పిదం కాదు, పసిపిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్న ఒక అమానుషమైన చర్యగా మనం చూడాలని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలురీకాల్ వెనుక ఉన్న భయంకరమైన కారణం ..సెరియులైడ్ అనే టాక్సిన్ అని తెలుస్తోంది. ఇది బాసిల్లస్ సిర్యస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఉత్పన్నమయ్యే ఒక విష పదార్థం. నిజానికివిషపు బ్యాక్టీరియా గురించి తెలిస్తే ఎవరైనా వణికిపోతారు. ఎందుకంటే సాధారణంగా ఆహారంలోని బ్యాక్టీరియాను మనం వేడి చేయడం ద్వారానో లేదా మరిగించడం ద్వారానో చంపేయొచ్చు.

కానీసెరియులైడ్ టాక్సిన్ హీట్ స్టేబుల్ అవడంతో.. ఈ మిల్క్ పౌడర్ కలిపిన పాలను మనం ఎంత వేడి చేసినా, ఎంతగా మరిగించినావిషం మాత్రం చావదు. అది పౌడర్ నుంచి నేరుగా శిశువు శరీరంలోకి చేరుతుంది. ఈ విష పదార్థం శరీరంలోకి వెళ్లిన కొద్ది గంటల్లోనే పసిబిడ్డలు వాంతులు, వికారం, కడుపునొప్పి , డీహైడ్రేషన్ బారిన పడతారు.

అంతేకాకుండా, శిశువుల కాలేయం ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందదు కాబట్టి, ఈ టాక్సిన్ వారి కాలేయాన్ని శాశ్వతంగా దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పరిణామం 31 దేశాల్లోని తల్లులను ఆందోళనలోకి నెట్టేసింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోప్ దేశాలతో పాటు హాంకాంగ్ వంటి ఆసియా దేశాలలో కూడాకలుషిత ప్రొడెక్ట్స్ విక్రయించబడ్డాయి. నెస్లే సంస్థ చెబుతున్న దాని ప్రకారం, అరాకిడోనిక్ యాసిడ్ ఆయిల్ (ARA) అనే ముడి పదార్థం సరఫరాలో జరిగిన లోపం వల్లేటాక్సిన్ ఉత్పత్తుల్లోకి చేరినట్లు తెలుస్తోంది.

ఏఆర్ఏ అనేది శిశువుల మెదడు అభివృద్ధికి తోడ్పడే ఒక ముఖ్యమైన ఫ్యాటీ ఆమ్లం. దీన్ని పౌడర్‌లో కలిపేటపుడు విషం వచ్చి చేరిందని కంపెనీ సంజాయిషీ ఇస్తోంది. అయితే ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ అని చెప్పుకునే నెస్లేకు ముడి పదార్థాల నాణ్యతను పరీక్షించే కనీస బాధ్యత లేదా అనేదే ఇక్కడ తలెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఒక ఫ్యాక్టరీలో టన్నుల కొద్దీ ఉత్పత్తి జరుగుతున్నప్పుడు, అందులో విషం ఉందని ప్యాకింగ్ చేసి.. సప్లై కూడా చేసే వరకు ఎందుకు కనిపెట్టలేకపోయారు?

అయితే నెస్లే (Nestle)కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. ఇంతకుముందు భారత దేశంలోమ్యాగీనూడుల్స్‌లో మోతాదుకు మించి సీసం (Lead) ఉందనే వివాదంతో ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలుసు. అప్పట్లో కూడా కంపెనీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కోర్టుల చుట్టూ కూడా తిరిగింది. ఇప్పుడు మళ్లీ అదే తీరును చిన్నారుల ఫుడ్ విషయంలో ప్రదర్శిస్తోంది.

ఇప్పటివరకుబిడ్డకూ అనారోగ్యం కలగలేదని..తాము ముందు జాగ్రత్తగా వెనక్కి తీసుకుంటున్నామని నెస్లే చెబుతున్న మాటలు కేవలం నష్ట నివారణ చర్యలు మాత్రమే. ఎందుకంటే ఒకవేళఉత్పత్తులను వాడిన తర్వాత ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే, ఆ పసిబిడ్డ ప్రాణాన్ని మళ్లీ తిరిగి తీసుకురాగలరా అనేదే ఇక్కడ ప్రశ్న? పెద్ద కంపెనీలకు కేవలం లాభాలే పరమావధిగా మారుతున్నాయి తప్ప, సామాజిక బాధ్యత మచ్చుకైనా కనిపించడం లేదని మరోసారి రుజువయింది.

Nestle
Nestle

అయితే ప్రస్తుతానికిరీకాల్ జాబితాలో భారతదేశం పేరు లేదని నెస్లే (Nestle) స్పష్టం చేసింది. భారత్‌లో లాక్టోజెన్ ప్రో, నాన్ ప్రో వంటి ప్రొడెక్ట్స్ విక్రయించబడుతున్నాయి. అయినా కానీ మన దేశంలోని తల్లులు ఊపిరి పీల్చుకోవడానికి ఇది సరైన సమయం కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే, విదేశాల్లో రిజెక్ట్ అయిన స్టాక్‌ను, క్వాలిటీ పరీక్షల్లో విఫలమైన బ్యాచ్‌లను భారత్ వంటి భారీ మార్కెట్ ఉన్న దేశాలకు దొడ్డిదారిన మళ్లించే ఛాన్స్ ఎప్పుడూ ఉంటుంది.

ఇక మన దేశంలో ఉన్న ఆహార భద్రతా ప్రమాణాలు (FSSAI) ఎంతవరకు పటిష్టంగా ఉన్నాయనేది ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకమే అని అందరికీ తెలిసిన విషయమే. అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్నంత కఠినమైన నిబంధనలు ఇక్కడ ఉండవు కాబట్టి, ఇలాంటి బహుళజాతి కంపెనీలు మన దేశంలో యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నాయి.

రీకాల్ ప్రక్రియలో కంపెనీ తన వెబ్‌సైట్‌లో బ్యాచ్ నంబర్లను పెట్టి, వాటిని సరిచూసుకోమని చెబుతుంది. అసలు చదువురాని తల్లులు, మారుమూల గ్రామాల్లో ఉండే వాళ్లుబ్యాచ్ నంబర్లను ఎలా చూసుకుంటారు? ఒక్కసారి ప్యాకెట్ కొన్న తర్వాత మళ్లీ దాన్ని వెనక్కి తీసుకెళ్లి ఇచ్చే తీరిక, అవగాహన ఎంతమందికి ఉంటుంది? దీనివల్ల జరగాల్సిన నష్టం జరిగితే ఎవరిది బాధ్యత? ఇది కేవలం ఒక ప్రొడక్ట్ ఫెయిల్యూర్ కాదు, ఇది ఒక వ్యవస్థాగత వైఫల్యమే. ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాల్లో కేవలం నోటీసులతో సరిపెట్టకుండా, ఆ కంపెనీల లైసెన్సులను రద్దు చేయడం , భారీ జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి వాటికి చెక్ పెట్టగలరు..

కార్పొరేట్ దందాలో చిన్నారుల ప్రాణాలు బలి అవ్వకూడదు. ప్రస్తుతం తల్లిదండ్రులు చేయాల్సిందల్లా ఒకటే.. బేబీ ఫుడ్ డబ్బా కింద ఉన్న కోడ్‌ని వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఏ చిన్న అనుమానం వచ్చినాపౌడర్‌ను వాడటం ఆపేయాలి. వీలైతే సహజ సిద్ధమైన ఆహారానికి, తల్లి పాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

Vaibhav Sooryavanshi : కొత్త ఏడాదిలోనూ తగ్గేదే లే.. మళ్లీ బాదేసిన వైభవ్ సూర్యవంశీ

Related Articles

Back to top button