Just InternationalJust PoliticalLatest News

Donald Trump: ప్లీజ్ ప్లీజ్ అంటే కలిసా.. మోదీపై ట్రంప్ హాట్ కామెంట్స్..

Donal Trump : ప్లీజ్ ప్లీజ్ అంటూ మోదీ మాట్లాడినట్టు అర్థం వచ్చేలా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు

Donald Trump

అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump) ఇటీవల కాలంలో భారత్ ను, ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ గా పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ పై సుంకాలు పెంచడం దగ్గర నుంచీ పాక్ తో యుద్ధం ఆపింది తానేనంటూ, మోదీ తనకు మంచి ఫ్రెండ్.. తన మాట కాదనరు అంటూ ఏదేదో మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా మరోసారి ట్రంప్ ( Donald Trump ) అలాంటి తరహా వ్యాఖ్యలే చేశారు. తనను కలిసేందుకు ప్లీజ్ ప్లీజ్ అంటూ మోదీ మాట్లాడినట్టు అర్థం వచ్చేలా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో తయారైన అపాజీ హెలికాఫ్టర్ల డెలివరీ విషయంలో భారత ప్రధాని మోదీ తనతో సమస్యలను ప్రస్తావించారన్నారు.

ఆ సందర్భంగా మోదీ .. తనను  సర్ అంటూ, ప్లీజ్ కలవచ్చా అంటూ సంబోధించారని వ్యాఖ్యానించారు. రక్షణ ఉత్పత్తులు, విదేశాలకు సైనిక సామాగ్రి విక్రయాల గురించి అధికారులతో జరిగిన చర్చలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. ఇండియా 68 అపాచీ హెలికాఫ్టర్లను ఆర్డర్ చేసిందని, ఇదే విషయమై మోదీతో తనతో మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సర్ అంటూ సంభోదించి మిమ్మల్ని కలవొచ్చా అంటూ రిక్వెస్ట్ చేసారని ట్రంప్ తెలిపారు.

అయితే తామిద్దరం మంచి మిత్రులమంటూ చెబుతూనే ట్రంప్ వ్యంగ్యంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. హెలికాఫ్టర్ కొనుగోలు డీల్ కు సంబంధించి భారత్ తన దగ్గరకు వచ్చి బ్రతిమాలిందన్న విధంగా ట్రంప్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.

Donald Trump
Donald Trump

ఇదిలా ఉంటే తాము అవలంబించిన వాణిజ్య విధానాలతోనే మోదీతో సంబంధం దెబ్బతిన్నట్టు కూడా ఇదే కార్యక్రమంలో ట్రంప్ అంగీకరించారు. భారత్ పై భారీగా పెంచిన సుంకాల ప్రభావం దీనికి కారణంగా చెప్పుకొచ్చారు. చాలా మొత్తంలో సుంకాలు చెల్లిస్తున్న మోదీ తనతో అంత సంతోషంగా లేరంటూ వెటకారం చేశారు.

అయితే తాను సుంకాలు పెంచిన తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించారంటూ ట్రంప్ మాట్లాడారు. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపకుంటే సుంకాలు పెంచుతానంటూ ట్రంప్ ( Donald Trump ) గతంలో హెచ్చరించారు. కానీ భారత్ మాత్రం ట్రంప్ బెదిరింపులకు లొంగలేదు. దీంతో భారత్ పై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. రానున్న రోజుల్లో మరింత పెంచేందుకు కూడా వెనుకాడబోమని ట్రంప్ స్పష్టం చేశారు.

Nestle:నెస్లే బేబీ ఫుడ్‌లో విషం.. 31 దేశాల్లో ఉత్పత్తుల వెనక్కి.. భారత్‌లో పరిస్థితి ఏంటి?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button