Suprabhatam:శ్రీవారి సుప్రభాతం వెనకున్న రహస్యం ఇదే..
Suprabhatam: సుప్రభాత సేవ కేవలం స్వామివారిని నిద్రలేపడమే కాదు, దీని వెనుక ఎంతో లోతైన అర్థం, ఆధ్యాత్మిక పరమార్థం దాగి ఉన్నాయంటారు పండితులు.
Suprabhatam
ప్రతిరోజూ ఉదయాన్నే తిరుమల కొండపై వినిపించే ‘కౌసల్యా సుప్రజా రామ..’ అనే శ్లోకం మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అంతెందుకు చాలామంది తమ ఇంట్లో,కొన్ని దేవాలయాల్లోనూ ఈ సుప్రభాతం(Suprabhatam) వింటూనే ఉంటాం.
అయితే ఈ సుప్రభాత సేవ కేవలం స్వామివారిని నిద్రలేపడమే కాదు, దీని వెనుక ఎంతో లోతైన అర్థం, ఆధ్యాత్మిక పరమార్థం దాగి ఉన్నాయంటారు పండితులు. అందుకే ప్రతీ వైష్ణవ ఆలయంలో , హిందూ ఇళ్లలో ఉదయాన్నే ఈ సుప్రభాతాన్ని వినడం ఒక ఆచారంగా వస్తోందని అంటున్నారు.
ప్రతివాది భయంకరం అణ్ణంగరాచార్యులు వారు 15వ శతాబ్దంలో ఈ సుప్రభాతం రచించారు. ఇందులో మొత్తం నాలుగు భాగాలు ఉంటాయి..అవి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం. మొదటగా స్వామివారిని నిద్రలేపుతూ, ఆ తర్వాత ఆయన గొప్పతనాన్ని కొనియాడుతూ, తర్వాత శరణాగతి వేడుకుంటూ, చివరగా మంగళం పలుకుతూ ఈ స్తోత్రం సాగుతుంది.

సుప్రభాతం(Suprabhatam) వినడం వల్ల మన మనసులోని ప్రతికూల ఆలోచనలు తొలిగిపోయి సానుకూల శక్తి (Positive Energy) ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో కానీ లేచిన వెంటనే కానీ ఈ స్తోత్రాన్ని వినడం లేదా పఠించడం చేస్తే ఆ రోజంతా విజయవంతంగా సాగుతుందని పెద్దల నమ్మకం.
ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు మానసిక ఏకాగ్రత కోసం సుప్రభాతాన్ని వినడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. గోవిందుడి నామస్మరణతో రోజును ప్రారంభించడం వల్ల అన్ని గ్రహ దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు.
Reviews and Ratings:సంక్రాంతి సినిమాల రివ్యూలు, రేటింగ్స్ బంద్..కోర్టు జోక్యం ఎందుకు?



