India : రాకెట్ ఫోర్స్ కమాండ్ పై భారత్ ఫోకస్..పాక్ కు బుద్ధి చెప్పడానికి రెడీ
India :రాకెట్ మిసైల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు భారత్ రెడీ అయింది
India
రాకెట్ మిసైల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు భారత్ ( India ) రెడీ అయింది. ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. భారత్ వీటి మీద ఫోకస్ పెట్టడానికి పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే భవిష్యత్ యుద్ధాలు నేరుగా జరగవని ఎప్పుడో తేలిపోయింది. సైన్యాలు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయడానికి ముందే శత్రు దేశాలను తమ మిస్సైళ్లతో నామరూపాల్లేకుండా చేసే పరిస్థితులొచ్చాయి. ఉక్రెయిన్, గాజాలో ప్రస్తుతం అదే జరుగుతోంది.
కాస్త వివరంగా చెప్పాలంటే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణల్లోనూ మిస్సైళ్లే గేమ్ ఛేంజర్లుగా ఉన్నాయి. ఇటువంటి ఒక ఫోర్స్‌ను మొట్టమొదట డ్రాగన్ కంట్రీ చైనానే ఏర్పాటు చేసింది. 1966లోనే ఆ దేశం రాకెట్ ఫోర్స్‌కు పునాది వేసింది. 2015లో PLA 2వ ఆర్టిలెరీ ఫోర్స్ పేరుమార్చి రాకెట్ ఫోర్సుగా చేసింది. దీనివద్దే చైనాలో అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి. ఈఫోర్స్ పరిధిలోకి భారత్‌లోని నగరాలన్నీ వస్తాయి.
ఫలితంగా ప్రపంచంలో అత్యాధునిక రాకెట్ ఫోర్స్ కలిగిన దేశాల్లో డ్రాగన్ టాప్‌లో నిలిచింది. భారత్‌తో సరిహద్దు వివాదం రేగగానే చైనాకు చెందిన రాకెట్ ఫోర్స్‌ను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించింది. ఆపరేషన్ సిందూర్‌తో పాక్ కూడా అదే చేస్తోంది. అందుకే, భారత్ సైతం రాకెట్ మిస్సైల్ ఫోర్స్‌పై ఫోకస్ చేసింది.

నిజానికి మోడీ సర్కార్ ఎప్పుడో రాకెట్ ఫోర్స్ దిశగా అడుగులేసింది. 2021 సెప్టెంబర్‌లో నాటి సీడీఎస్ దివంగత బిపిన్ రావత్ ఈ దిశగా సంచలన ప్రకటన చేశారు. రాకెట్ ఫోర్స్‌లో భాగంగానే ప్రళయ్ క్షిపణిని వేగంగా అభివృద్ధి చేశారు. ఘన ఇంధన రాకెట్ మోటార్‌తో నడిచే ఈ క్షిపణి శత్రువుల కంటికి చిక్కకుండా అత్యంతవేగంగా దూసుకెళ్లగలదు.
జులైలో ఈ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. వరుసగా రెండు ఫ్లైట్ ట్రైల్స్ నిర్వహించామని.. ప్రళయ్ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించినట్టు నాడు డీఆర్డీవో ప్రకటించింది. భారత అమ్ములపొదిలో ఉన్న శత్రుభీకర క్షిపణులు రాకెట్ ఫోర్స్ ద్వారా ఏకమైతే శత్రు దేశాల్లో పెను విధ్వంసం తప్పదు. వీటికితోడు అత్యాధునిక డ్రోన్లను కూడా ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ ద్వివేదీ ప్రకటించారు. నిజానికి.. రాకెట్ ఫోర్స్ ఏర్పాటు కాకుండానే భారత్ సత్తా చాటింది. అయినప్పటికీ మరింత బలం పుంజుకోవడమే లక్ష్యంగా రాకెట్ ఫోర్స్ పై దృష్టి పెట్టింది.
BRS : బీఆర్ఎస్ కమ్ బ్యాక్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? ..ఆ ఒక్క అస్త్రంతో కాంగ్రెస్ కోటను ఢీకొట్టగలదా?



