Just EntertainmentLatest News

Vygha Reddy :పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే వారంతా వేస్ట్ ఫెలోస్..వైరల్ అవుతోన్న వైఘారెడ్డి కామెంట్స్

Vygha Reddy : దిల్ రాజు మాత్రమే కాదు, ఆయన భార్య వైఘా రెడ్డి కూడా పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానే అని.. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యల ద్వారా అందరికీ తెలిసింది.

Vygha Reddy

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా ఓ వెలుగు వెలుగుతున్న దిల్ రాజుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో చాలామందికి తెలిసిన విషయమే. అయితే, కేవలం దిల్ రాజు మాత్రమే కాదు, ఆయన భార్య వైఘా రెడ్డి (Vygha Reddy) కూడా పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానే అని.. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యల ద్వారా అందరికీ తెలిసింది.

రీసెంట్ గా ఒక పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైఘా రెడ్డి(Vygha Reddy) … యాంకర్ పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ , ఇటీవల ఆయనపై జరిగిన బాడీ షేమింగ్ వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా ఆమె ఘాటుగా స్పందించారు.

పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిపై విమర్శలు చేసేవారిని ఆమె వేస్ట్ ఫెలోస్ అని తేల్చిపడేశారు. ఆయన ప్రజా సేవ కోసం ఎంతగా కష్టపడుతున్నారో.. విమర్శించేవారు గమనించడం లేదని వైఘా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన రాజకీయాల్లోకి వచ్చి సామాన్య ప్రజల కోసం రోడ్లపై నడుస్తున్నారని, సరైన వసతులు లేకపోయినా ప్రజల మధ్యే పడుకుంటున్నారని.. ఇవన్నీ చూస్తూ కూడా ఆయనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారంటే వారు నిజంగా పనికిరాని వారేనని వైఘా రెడ్డి (Vygha Reddy) చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ దేని గురించి మాట్లాడినా అది హృదయం లోతుల్లో నుంచి వస్తుందని , అందుకే ఆయన మాటలకు అంత పవర్ ఉంటుందని అన్నారు.

Vygha Reddy
Vygha Reddy

పవన్ కళ్యాణ్‌లో కనిపించే ఎమోషన్స్ అన్నీ సహజమైనవని అన్న వైఘా రెడ్డి (Vygha Reddy) ..ఆయన కొన్నిసార్లు కోపంగా మాట్లాడొచ్చు, మరికొన్నిసార్లు ఎమోషనల్ కావొచ్చు.. కానీ అవన్నీ ఆయనలో నుంచి వచ్చే స్వచ్ఛమైన భావోద్వేగాలు అని చెప్పుకొచ్చారు. ఎవరో రాసిచ్చిన స్పీచ్ చదివే వ్యక్తి పవన్ కాదన్నారు.

ఒక నాయకుడిగా ఆయనలో ఉన్న నిజాయితీ చూసే చాలా మంది ఆయనను ఇష్టపడతారన్న వైఘారెడ్డి..నేను కూడా వారిలో ఒకరినని ఆమె అన్నారు. సినిమాల్లో కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా, కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, ఆయనకు డబ్బు మీద ఎటువంటి వ్యామోహం లేదని నిజమైన ఫ్యాన్‌గానే చెప్పారు.

ఇక పవన్ కళ్యాణ్‌పై వైఘారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు.. ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Sakhi Centres:సఖీ కేంద్రాల గురించి మీకు తెలుసా? అసలెందుకీ కేంద్రాలు?

Related Articles

Back to top button