Just NationalLatest News

Railway job:టెన్త్ క్లాస్ అర్హతతో రైల్వే జాబ్..పూర్తి వివరాలివే!

Railway job: దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న సుమారు 22,000 కంటే ఎక్కువ గ్రూప్-డి (లెవల్ 1) పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది.

Railway job

భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న సుమారు 22,000 కంటే ఎక్కువ గ్రూప్-డి (లెవల్ 1) పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది.

ఈ మేరకు ప్రాథమిక ఉద్యోగ ప్రకటనను (Short Notification) తాజాగా రిలీజ్ చేసింది. కొంతకాలంగా సరైన నోటిఫికేషన్లు లేక ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ భారీ రిక్రూట్‌మెంట్ ఒక గొప్ప అవకాశమని చెప్పొచ్చు.

ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం ..తాజా సమాచారం ప్రకారం, ఈ రైల్వే ఉద్యోగాల(Railway job)కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో చిన్న మార్పు జరిగింది. ముందు జనవరి 21 నుంచే అప్లికేషన్లు ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దీనిని జనవరి 31, 2026కి మార్చారు.

అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31 నుంచి ఆన్‌లైన్ ద్వారా తమ అప్లికేషన్లను సమర్పించొచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 2, 2026 రాత్రి 11:59 గంటల వరకు గడువు ఇచ్చారు. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

Railway job
Railway job

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. అందులో ప్రధానంగా..

1. పాయింట్స్‌మన్
2. ట్రాక్ మెయింటెయినర్
3. అసిస్టెంట్ లోకో షెడ్
4. అసిస్టెంట్ ఆపరేషన్స్
5. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ పోస్టులు

విద్యార్హతలు మరియు ఎంపిక ప్రక్రియ.. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కనీసం పదో తరగతి (10th Class) , ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అది కూడా రైల్వే ఉద్యోగం (Railway job) సాధించడానికి ఇది సువర్ణావకాశం. సెలక్షన్ ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), శారీరక సామర్థ్య పరీక్ష (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది.

ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్ డీ అఫీషియల్ వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి [indianrailways.gov.in](https://indianrailways.gov.in)

Obesity :2035 నాటికి భారత్‌కు ముప్పు తప్పదా? సగం మంది ఒబెసిటీ బారిన పడనున్నారా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button