T20 : భారత్ జోరు కొనసాగేనా ?..రెండో టీ20కి అంతా రెడీ
T20 : రెండో టి20 కోసం జట్టులో ఒక మార్పు.. అతడు అవుట్..
T20
వన్డే సిరీస్ పరాభవం నుంచి త్వరగానే కోలుకుని టీ20 (T20)సిరీస్ ను ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. రాయ్ పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. నాగ్ పూర్ లో అభిషేక్ శర్మ విధ్వంసం, రింకూ సింగ్ మెరుపులతో భారీస్కోరు సాధించి కివీస్ ను చిత్తు చేసిన భారత్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. అయితే గాయం కారణంగా అక్షర్ పటేల్ దూరమవడం ఎదురుదెబ్బగానే చెప్పాలి.
తొలి టీ ట్వంటీలో (T20) బౌలింగ్ చేస్తుండగా బ్యాటర్ కొట్టిన షాట్ ను ఆపే ప్రయత్నంలో అక్షర్ వేలికి తీవ్ర గాయమై రక్తం వచ్చింది. దీంతో ఆ ఓవర్ ను అభిషేక్ శర్మ పూర్తి చేశాడు. అతని స్థానంలో తుది జట్టులో కుల్దీప్ కు చోటు దక్కుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తొలి టీ ట్వంటీలో బ్యాటింగ్, బౌలింగ్ లో భారత్ అదరగొట్టింది. బ్యాట్ తో అభిషేక్ , సూర్యకుమార్, హార్థిక్ , రింకూ సింగ్ సత్తా చాటితే.. బౌలింగ్ లో పేసర్లు, స్పిన్నర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి కివీస్ ను దెబ్బకొట్టారు.
అయితే ఫీల్డింగ్ మాత్రం టెన్షన్ పెడుతోంది. నాగ్ పూర్ లో భారత జట్టు ఫీల్డింగ్ స్థాయికి తగినట్టు లేదు. రనౌట్ తో పాటు పలు క్యాచ్ లు వదిలేశారు. భారీస్కోరును టార్గెట్ గా నిర్థేశించడంతో పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఒకవేళ కొంచెం తక్కువ స్కోరు ఉండి ఉంటే అదే ఫీల్జింగ్ మ్యాచ్ ను శాసించేది. ఈ నేపథ్యంలో క్యాచ్ లపై మన క్రికెటర్లు మరింతగా ఫోకస్ పెట్టాలని భారత మాజీలు సూచిస్తున్నారు.
భారత జట్టు కూర్పులో బ్యాటింగ్ విషయానికొస్తే సంజూ శాంసన్ రెండో వన్డేలోనైనా పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అంతా ఎదురుచూస్తున్నారు. అలాగే ఇషాన్ కిషన్ కూడా తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అటు సూర్యకుమార్ యాదవ్ చాలారోజుల తర్వాత ఫామ్ అందుకున్నాడు.

అయితే తన మెరుపులను భారీ ఇన్నింగ్స్ గా మలచలేకపోయాడు. ఇక హార్థిక్ పాండ్యా, రింకూ సింగ్ తమపై ఉన్న అంచనాలను అందుకున్నారు. ముఖ్యంగా రింకూ సింగ్ చాలా రోజుల తర్వాత ఇచ్చిన అవకాశాన్ని రెండు చేతులూ ఒడిసిపట్టుకున్నాడు. 20 బంతుల్లోనే 44 రన్స్ చేసిన రింకూ ఫినిషర్ రోల్ ను బాగానే పోషిస్తున్నాడు. అటు బౌలింగ్ లో అర్షదీప్ సింగ్ , హార్థిక్ పాండ్యా రాణించగా.. బుమ్రా తొలి మ్యాచ్ లో వికెట్ తీయలేకపోయాడు.
వరుణ్ చక్రవర్తి , దూబే కూడా బంతితో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే తొలి మ్యాచ్ లో ఓడినా న్యూజిలాండ్ ను తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే వన్డే సిరీస్ లో సైతం తొలి మ్యాచ్ ఓడి తర్వాత అద్భుతంగా పుంజుకుని సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఐదు మ్యాచ్ ల సిరీస్ కావడంతో భారత్ కు ఆధిక్యం పెంచుకునేందుకు, సిరీస్ గెలుపుకు మరింత చేరువయ్యేందుకు ఇది మంచి అవకాశం. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ పుంజుకుని సిరీస్ సమం చేయాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది.
Negative Energy:ఈ చిన్న మార్పులు చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మాయం




One Comment