Just SportsLatest News

Arshdeep Singh : అర్షదీప్ కు ఐసీసీ షాక్.. మ్యాచ్ ఫీజులో జరిమానా

Arshdeep Singh : టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్ ఒకవైపు సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు భారత పేసర్ అర్షదీప్ సింగ్కు ఐసీసీ షాకిచ్చింది

Arshdeep Singh

టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్ ఒకవైపు సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు భారత పేసర్ అర్షదీప్ సింగ్(Arshdeep Singh) కు ఐసీసీ షాకిచ్చింది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో అతిగా ప్రవర్తించినందుకు జరిమానా విధించింది. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిఛెల్ పైకి బంతిని విసిరినందుకు మ్యాచ్ ఫీజులో 15 శాతం ఫైన్ వేసింది. అంతేకాకుండా ఒక డీమెరిస్ పాయింట్ ను కూడా చేర్చింది.

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ 11వ ఓవర్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్లో డారిల్ మిఛెల్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన అర్షదీప్(Arshdeep Singh) తర్వాతి బాల్ ను డాట్ వేశాడు. మిఛెల్ కొట్టిన షాట్ తో అర్షదీప్ వైపే బంతి రావడం, దానిని అందుకుని వికెట్ల వైపు విసిరే క్రమంలో మిఛెల్ శరీరానికే బలంగా తగిలింది. దీనిపై మిఛెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్షదీప్ వైపు దూసుకొచ్చాడు.

ఏంటి అంటూ అర్షదీప్ సింగ్ కూడా స్పందించడంతో అంపైర్ , కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి నచ్చజెప్పారు. అర్షదీప్ కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా తర్వాతి బంతిని వేసేందుకు వెళ్లిపోగా అంపైర్ పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. ఓవర్ ముగిసిన తర్వాత అర్షదీప్ సింగ్ నేరుగా మిఛెల్ దగ్గరకు వెళ్లి సారీ కూడా చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ హగ్ చేసుకుని సరదాగా మాట్లాడుకున్నారు.

Arshdeep Singh
Arshdeep Singh

అయితే ఐసీసీ మాత్రం దీనిని సీరియస్ గా తీసుకుంది. ఫీల్డ్ అంపైర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రత్యర్థి ఆటగాడిని బంతి లేదా బ్యాట్ తో ఉద్దేశపూర్వకంగా గాయపరిచేలా ప్రవర్తించడం నేరంగా పరిగణిస్తారు. దీంతో వీడియో ఫుటేజ్ ను పరిశీలించిన రిఫరీ 15 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్ ను చేర్చారు.

దీని ప్రకారం తర్వాతి 24 నెలల్లో మరో డీమెరిట్ పాయింట్ చేరితో అర్షదీప్ పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఇదిలా ఉంటే తాను కావాలని మిఛెల్ పైకి బంతిని విసరలేదని, బాల్ స్వింగ్ అతనికి తాకిందంటూ మ్యాచ్ అనంతరం అర్షదీప్ చెప్పాడు. అయినప్పటకీ రిఫరీ మాత్రం అతను మరోసారి ఇలా చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button