Just LifestyleHealthLatest News

45 Years:45 ఏళ్లు దాటిన వారు చేయాల్సిన పనులివే ..

45 Years: సూర్యోదయానికి ముందే నడవడం వల్ల విటమిన్-డి లభించడమే కాకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటాయి.

45 Years

వయసు 45 దాటిందంటే మన శరీరం ఒక కొత్త దశలోకి ప్రవేశించినట్లే. యవ్వనంలో మనం చేసిన తప్పులను భరించిన మన శరీరం, ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లను కూడా ఏ మాత్రం క్షమించదు. అందుకే 45 ఏళ్లు(45 Years) దాటిన ప్రతి ఒక్కరూ తమ శరీరం కోసం ఒక మాన్యువల్ రూపొందించుకోవాలి. మీ శరీరానికి ఇప్పుడు కావలసింది ఖరీదైన మందులు కాదు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి.

ఆహారమే ఔషధం..45 ఏళ్ల వయసులో మనం తినే ప్రతి ముద్ద మన ఆరోగ్యాన్ని శాసిస్తుంది. షుగర్, మైదా, ప్యాకెట్ ఫుడ్స్ కు పూర్తిగా స్వస్తి చెప్పాలి. రాత్రి పూట హెవీ మీల్స్ తీసుకోవడం వల్ల లివర్ , జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆకుకూరలు, మిల్లెట్స్ అంటే జొన్న, రాగి, సజ్జలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. మన కడుపు 80% నిండినప్పుడే అంటే 20 శాతం ఖాళీ ఉండగానే భోజనం ఆపేయడం నేర్చుకోవాలి.

నడక – ఒక సంజీవని..రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వేగంగా నడవాలి. వీలైతే సూర్యోదయానికి ముందే నడవడం వల్ల విటమిన్-డి లభించడమే కాకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటాయి.

45 Years
45 Years

నిద్ర, మనస్సు..రాత్రి 10 గంటలకల్లా నిద్రపోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. నిద్ర తక్కువ అయితే గుండె సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి జరుగుతాయి. అలాగే 45 ఏళ్ల(45 Years) తర్వాత బాధ్యతలు, ఒత్తిడి పెరుగుతాయి. రోజుకు 10 నిమిషాల ధ్యానం లేదా మౌనం మీ మెదడుకు విశ్రాంతిని ఇస్తుంది. ముఖ్యంగా మొబైల్ వాడకాన్ని తగ్గించడం చాలా ముఖ్యం అన్న విషయాన్ని తెలుసుకోవాలి.

ముందస్తు పరీక్షలు..ప్రతీ ఏటా ఒకసారి పూర్తి బాడీ చెకప్ చేయించుకోవాలి. బీపీ, షుగర్, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవడం వల్ల ఫ్యూచర్లో రాబోయే పెద్ద ప్రమాదాలను ముందే అడ్డుకోవచ్చు.

ఆఖరిది అలాగే ముఖ్యమయినది నవ్వు. నవ్వడం అనేది ఒక అద్భుతమైన థెరపీగా పనిచేస్తుంది. కుటుంబంతో గడపడం, కృతజ్ఞత భావం కలిగి ఉండటం మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. మందులపై కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్‌పై ఆధారపడితే మీ శేష జీవితం చాలా ఆనందంగా సాగుతుంది.

Generation:మాయమైపోతున్న మహోన్నత తరం.. మనం ఏం కోల్పోతున్నామో తెలుసా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button