Generation:మాయమైపోతున్న మహోన్నత తరం.. మనం ఏం కోల్పోతున్నామో తెలుసా?
Generation: కేవలం వయసు పైబడిన వారు వెళ్లిపోవడం మాత్రం కాదు..వారితో పాటు విలువలు, ఆప్యాయతలు, ఓర్పు, సహనం అనే ఒక గొప్ప జీవనశైలి కూడా అంతమైపోతోంది.
Generation
ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. చేతిలో కావాల్సినంత డబ్బు ఉంది, ఇంట్లో విలాసవంతమైన ఫర్నిచర్ ఉన్నాయి. కానీ, మనసులో ప్రశాంతత ఉందా అని ప్రశ్నించుకుంటే మాత్రం సమాధానం దొరకడం కష్టం.ఒకప్పుడు ఇవేమీ లేని జీవితాలతో కావాల్సినంత ప్రశాంతతతో జీవించిన వాళ్లు మన ముందే ఉన్నారు.
అయితే మనకు తెలీకుండానే ఆ అద్భుతమైన తరం(Generation) మన కళ్ల ముందే మెల్లగా కనుమరుగైపోతోంది. అది కేవలం వయసు పైబడిన వారు వెళ్లిపోవడం మాత్రం కాదు..వారితో పాటు విలువలు, ఆప్యాయతలు, ఓర్పు, సహనం అనే ఒక గొప్ప జీవనశైలి కూడా అంతమైపోతోంది.
ఆ తరం(Generation) మనుషులకు పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు, కానీ జీవితం అనే మహా గ్రంథాన్ని వారు పూర్తిగా చదివారు.ఎదుటివారి చిన్న చిన్న విజయాలకు కూడా ఆనందంతో ఆనందభాష్పాలు పెట్టుకునే కళ్లు వారివి.
ఆకలితో మన ఇంటికి ఎవరు వచ్చినా, నేను అనకుండా మనం అని మనసారా అన్నం పెట్టిన గొప్ప మనసు వారిది. ఇల్లు చిన్నదైనా వారి హృదయాలు చాలా విశాలంగా ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో కష్టసుఖాలను సమానంగా పంచుకున్న తరం అది.ఎందుకంటే ఆస్తుల కంటే ఆప్యాయతలే గొప్ప ఆస్తులని వారు నమ్మారు.
గడియారం లేకపోయినా ఆకాశంలోని సూర్యుడిని చూసి కచ్చితమైన సమయం చెప్పడమే కాదు.. చేతిలో క్యాలిక్యులేటర్ లేకపోయినా నోటి లెక్కలతో అద్భుతమైన లాభనష్టాలను లెక్కించే అపర మేధావులు వాళ్లు. ఇంటర్నెట్, గూగుల్ మ్యాప్స్ లేకున్నా అడవి దారిలో కూడా గమ్యాన్ని చేరుకోగలిగిన అపారమైన అనుభవుజ్ఞులు.

వాళ్లకు తెలివి అంటే కేవలం మార్కులు కాదు, జ్ఞానం అంటే కేవలం సమాచారం కాదు.. అనుభవమే అసలైన జ్ఞానమని తమ తర్వాత తరాలకు జీవిత పాఠాలు నేర్పిన టీచర్లు. మొబైల్ ఫోన్లు లేని ఆ రోజుల్లో పోస్ట్ కార్డులపై రాసిన నాలుగు వాక్యాలే, ఈరోజు గంటల కొద్దీ చేసే వీడియో కాల్స్ కంటే ఎక్కువ ప్రేమని పంచేవంటే అతి శయోక్తి కాదేమో.
ఆరుబయట మంచం వేసుకుని చల్లగాలిలో, వెన్నెల వెలుతురులో హాయిగా నిద్రపోవడం తప్ప వాళ్లకి ఏసీలు, కూలర్లు తెలీదు. బావి నీళ్లు తాగి రాళ్లు తిన్నా అరిగించుకునే జీర్ణశక్తిని కలిగి ఉండటమే తప్ప మినరల్ వాటర్ మాట కూడా తెలీదు. వారిని వంద ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉంచే జొన్న రొట్టెలు, సజ్జ అన్నం తినడమే కానీ ..పిజ్జాలు, బర్గర్ల సంస్కృతే వాళ్లకు తెలీదు. అందుకే అప్పట్లో బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్‌లు అన్న పదాలు వారికి తెలీనే తెలీవు.
అటువంటి గొప్ప తరం(Generation) ఇప్పుడు ఒక్కొక్కరుగా మనకు వీడ్కోలు చెబుతున్నారు. అందుకే వారు ఉన్నప్పుడే వారి మాటలను ఓపికగా విందాం, వారిని ప్రేమగా గౌరవిద్దాం. వారి ఇష్టాఇష్టాలను తెలుసుకుని వారితో కాసేపు కబుర్లు చెబుదాం. ఎందుకంటే వారే ఇప్పటి మన జీవితానికి మూలాలు.
Ratha Saptami:రథసప్తమి విశిష్టత ..స్నానం చేసే పద్ధతి..పూజ ఎలా చేయాలో తెలుసా?




One Comment