Just SportsLatest News

Sanju Samson : సంజూపైనే అందరి ఫోకస్..హోంగ్రౌండ్ లో మెరుస్తాడా ?

Sanju Samson : తిరువనంతపురం వేదికగా శనివారం మ్యాచ్ జరగనుండగా.. అందరి చూపు లోకల్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) పైనే ఉంది

Sanju Samson

వన్డే సిరీస్ చేజార్చుకున్నా తాము సూపర్ ఫామ్ లో ఉన్న షార్ట్ ఫార్మాట్ లో అదరగొడుతున్న టీమిండియా కివీస్ పై సిరీస్ ను గెలిచింది. అయితే హ్యాట్రిక్ విజయాల తర్వాత విశాఖలో జైత్రయాత్రకు సడన్ బ్రేక్ పడింది. తుది జట్టు ఎంపికలో ప్రయోగాలు, బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం తప్పలేదు. ఇప్పుడు చివరి టీ ట్వంటీ మ్యాచ్ కు రెడీ అయింది.

తిరువనంతపురం వేదికగా శనివారం మ్యాచ్ జరగనుండగా.. అందరి చూపు లోకల్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) పైనే ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ కు ప్రపంచకప్ కు ముందు ఫామ్ అందుకునేందుకు సంజూకు మిగిలిన చివరి అవకాశం. అంతేకాదు తుది జట్టులో చోటు దక్కించుకునేందుకు కూడా ఇదే చివరి ఛాన్స్.

ఒకవేళ హోం గ్రౌండ్ లో కూడా సంజూ శాంసన్ ఫెయిలయితే మాత్రం మెగాటోర్నీలో భారత్ ఓపెనింగ్ కాంబినేషన్ మారిపోవడం ఖాయం. తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కు ఓపెనర్ గా అవకాశం దక్కొచ్చు. అప్పుడు సంజూ బెంచ్ కే పరిమితం కావాల్సిన పరిస్థితి. దీంతో ఏ విధంగా చూసినా న్యూజిలాండ్ తో జరిగే చివరి టీ ట్వంటీ సంజూ శాంసన్ కు అగ్నిపరీక్ష లాంటిది.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్(Sanju Samson) వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. మొదటి టీ20లో 2 ఫోర్లు బాది 10 పరుగులకు అవుటైన సంజూ శాంసన్, రెండో టీ20లో ఓ సిక్సర్ బాదేసి పెవిలియన్‌కి వెళ్లిపోయాడు. మూడో టీ20లో ఇన్నింగ్స్ తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.వైజాగ్‌లో జరిగిన నాలుగో టీ20లో అభిషేక్ శర్మ, ఇన్నింగ్స్ ఓపెన్ చేసి తొలి బంతికే అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

Sanju Samson
Sanju Samson

దీంతో సంజూ శాంసన్(Sanju Samson) తన సత్తా చాటేందుకు స్టేజ్ అంతా సిద్దమైపోయిందని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు.5 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మంచి ఆరంభం దక్కినా దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు. దీంతో మరోసారి సంజూ శాంసన్ ప్లేస్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఒకే మ్యాచ్ మిగిలి ఉండడంతో టీమ్‌లో మార్పులు చేయకపోవచ్చు.

అయితే ఓపెనర్ గా తన ప్లేస్ ను సుస్థిరం చేసుకునేందుకు అతనికి వచ్చిన సువర్ణావకాశం ఇదే. దీన్ని కాపాడుకోవాలంటే ఆఖరి టీ20లో అయినా అదరగొట్టాల్సిందే. ఇక తుది జట్టు విషయానికొస్తే శ్రేయాస్ అయ్యర్ కు మరోసారి నిరాశే మిగలనుంది. నాలుగో టీ20కి దూరమైన ఇషాన్ కిషన్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

RBI :తెలుగు రాష్ట్రాలకు ఆర్‌బీఐ హెచ్చరిక..దేనికోసం? మరి దీనికి పరిష్కారం ఉందా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button