Sleep :రాత్రి నిద్రకు మందు కావాలా? గాఢ నిద్రను ప్రసాదించే అద్భుత ఖనిజం గురించి తెలుసుకోండి..
Sleep : రాత్రి పడుకునే ముందు ఒక అరటి పండు తింటే దానిలోని పొటాషియం , మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తాయి.
Sleep
ఆధునిక కాలంలో నిద్రలేమి (Insomnia) అనేది ఒక కామన్ సమస్యలా మారుతోంది. నిద్ర రాక బెడ్‌పైన గంటల తరబడి ఆలోచనలతో సతమతమయ్యే వారికి మెగ్నీషియం ఒక వరప్రసాదం లాంటిది అంటున్నారు న్యూట్రిషనిస్టులు.
ఎందుకంటే శాస్త్రీయంగా చూస్తే, మెగ్నీషియం మన బాడీలోని గాబా’ (GABA) అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఇది మెదడులోని అనవసరపు ఆలోచనలను అరికట్టి, నాడీ వ్యవస్థను ప్రశాంత పరుస్తుంది.
కేవలం నిద్ర పట్టడమే కాకుండా, మధ్యలో మెలకువ రాకుండా గాఢ నిద్ర (Deep Sleep) పట్టేలా చేయడంలో మెగ్నీషియంకి సాటిలేదు. అలాగే రాత్రిపూట కాళ్లలో వచ్చే నరాల తిమ్మిర్లు (Restless Leg Syndrome) , కండరాల పట్టేయడం వంటి సమస్యలను కూడా ఇది నివారిస్తుంది.
నిద్రకు ముందు అది కూడా మంచి నిద్ర కోసం కావాల్సిన మెగ్నీషియం కోసం.. కేవలం సప్లిమెంట్ల మీద ఆధారపడకుండా సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. రాత్రి డిన్నర్ లో పాలకూర వంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మెగ్నీషియం కావాల్సినంత అందుతుంది.

అలాగే రాత్రి పడుకునే ముందు ఒక అరటి పండు తింటే దానిలోని పొటాషియం , మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తాయి. గుమ్మడి గింజలు, చియా గింజలను పెరుగులో కలుపుకుని తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.
మరీ ముఖ్యంగా రాత్రి వేళ గోరువెచ్చని పాలలో చిటికెడు మెగ్నీషియం పౌడర్ లేదా మెగ్నీషియం ఎక్కువగా ఉండే బాదం పప్పులను తింటే మంచి గాఢ నిద్ర(Sleep) పడుతుంది.
అంతేకాకుండా ఒత్తిడితో కూడిన పనులు చేసేవారు, ముఖ్యంగా రాత్రిపూట మొబైల్ చూస్తూ నిద్రను పోగొట్టుకునే వారు ఈ ఆహార మార్పులు చేసుకుంటే మర్నాడు రోజు ఉదయం ఎంతో ఉత్సాహంగా నిద్రలేస్తారని నిపుణులు చెబుతున్నారు.
RBI :తెలుగు రాష్ట్రాలకు ఆర్‌బీఐ హెచ్చరిక..దేనికోసం? మరి దీనికి పరిష్కారం ఉందా?




One Comment