Colors:మీకిది తెలుసా? మీ ఇంటి పెయింటింగ్స్ మీ ఆలోచనలను మారుస్తాయట..
Colors : మనం నివసించే ఇంటి గోడలకు ఉండే రంగులు, మనం చూసే పెయింటింగ్స్, మన ఆలోచనలను, ఉత్సాహాన్ని, ప్రశాంతతను శాసిస్తాయి.
Colors
రంగులు కేవలం కంటికి కనిపించే అందం మాత్రమే కాదట.. అవి మన మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయట. దీనినే సైకాలజీలో కలర్ థెరపీ అంటారు. దీని ప్రకారం మనం నివసించే ఇంటి గోడలకు ఉండే రంగులు(Colors), మనం చూసే పెయింటింగ్స్, మన ఆలోచనలను, ఉత్సాహాన్ని, ప్రశాంతతను శాసిస్తాయి.
ఏ రంగు ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది..
నీలి రంగు (Blue).. ఇది ప్రశాంతతకు చిహ్నం. పడకగదిలో నీలి రంగు ఉంటే నిద్ర బాగా పడుతుంది. అలాగే రక్తపోటు కూడా తగ్గుతుంది.
పసుపు రంగు (Yellow)..ఇది సంతోషానికి, ఉత్సాహానికి గుర్తు. వంటింట్లో లేదా హాల్ లో ఈ రంగు ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
ఎరుపు రంగు (Red).. ఇది శక్తిని, ఆవేశాన్ని సూచిస్తుంది. అయితే అతిగా ఎరుపు రంగు వాడటం వల్ల చిరాకు, ఆందోళన కలిగే అవకాశం ఉంది.
ఆకుపచ్చ రంగు (Green).. ప్రకృతికి దగ్గరగా ఉండే ఈ రంగు కళ్లకు హాయినిస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి గ్రీన్ కలర్ పెయింటింగ్స్ అద్భుతంగా పనిచేస్తాయి.

అలాగే మీ ఇంట్లో హాల్ లో యుద్ధం కానీ విచారంగా ఉన్న బొమ్మలు కానీ ఉంటే, మీకు తెలియకుండానే మీ మనస్సులో నెగటివ్ ఆలోచనలు వస్తాయి. అదే ప్రవహించే నది, పచ్చని కొండలు లేదా నవ్వుతున్న ముఖాలు ఉన్న పెయింటింగ్స్ ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది.
వాస్తు ప్రకారం కూడా ఈశాన్య మూలలో నీటి ధారలు ఉన్న బొమ్మలు ఉంటే ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు. మీ ఇంటి రంగుల(Colors)ను మార్చుకోవడం ద్వారా మీ జీవితంలోని ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.
Copper:బంగారం, వెండి కొనొద్దా? ఎర్ర బంగారం కొనడానికి ఇదే రైట్ టైమా?



