Just EntertainmentLatest News

Sharwanand:ఓటీటీలోకి సంక్రాంతి హంగామా ‘నారీ నారీ నడుమ మురారీ’.. స్ట్రీమింగ్ ఎక్కడ?

Sharwanand:సుమారు 34 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

Sharwanand

ఈ ఏడాది సంక్రాంతి బరిలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ , రవితేజ సినిమాలతో పాటు..ఏ హడావుడి లేకుండా సైలెంట్‌గా వచ్చిన మూవీ ..’నారీ నారీ నడుమ మురారీ’.సెన్సేషనల్ హిట్ అందుకున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) చిత్రం థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించి, సుమారు 34 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), స్ట్రీమింగ్ తేదీని అఫీషియల్‌గా ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. అంటే ప్రభాస్ సినిమా.. ది రాజాసాబ్ కంటే 2రోజుల ముందే శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ సినిమా కూడా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుండటం విశేషం.

Sharwanand
Sharwanand

సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్(Sharwanand) పక్కన.. సంయుక్త మీనన్, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇద్దరు అమ్మాయిల మధ్య హీరో శర్వానంద్ పడే పాట్లు, ఆ గందరగోళం నుంచి పుట్టే కామెడీ ప్రేక్షకులను చివరి వరకూ అలరించాయి.

ముఖ్యంగా వీకే నరేష్, వెన్నెల కిశోర్, సత్యల కామెడీ టైమింగ్ ఈ మూవీకి పెద్ద అసెట్‌గా నిలిచింది. దీనిలో హీరో శ్రీవిష్ణు అతిథి పాత్రలో మెరవడం మరో విశేషం. సంక్రాంతి సినిమాల్లో అన్ని సినిమాల కంటే ముందు ఓటీటీలోకి వస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. థియేటర్లలో మిస్ అయిన వారు అలాగే థియేటర్లలో చూసి ఇప్పుడు మళ్లీ మళ్లీ నవ్వుకోవాలనుకునే వారు ఫిబ్రవరి 4 నుంచి ప్రైమ్ వీడియోలో ఈ నవ్వుల విందును ఆస్వాదించొచ్చు.

Silver:ఫ్యూచర్ పెట్టుబడిగా వెండిని కొంటున్నారా? వీరికి ఫిబ్రవరి 1న షాక్ తప్పదా?

 

Related Articles

Back to top button