Just NationalLatest News

Modi : ఇందిరా గాంధీ రికార్డును బ్రేక్ చేసిన ప్రధాని మోదీ

Modi : జూలై 25, 2025 నాటికి, ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టి మొత్తం 4,078 రోజులు పూర్తయ్యాయి.

Modi : భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఎప్పుడూ ట్రెండ్ సెట్టరే. ఇప్పుడు ఆయన దేశ పరిపాలనా చరిత్రలోనే ఒక అదిరిపోయే రికార్డును క్రియేట్ చేశారు. మధ్యలో ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ఎక్కువ కాలం దేశ ప్రధానిగా కొనసాగిన వారి లిస్ట్‌లో, దివంగత ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi)రికార్డును మోదీ బ్రేక్ చేశారు.

Modi

జూలై 25, 2025 నాటికి, ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టి మొత్తం 4,078 రోజులు పూర్తయ్యాయి. అంతకు ముందు ఇందిరా గాంధీ పేరిట ఉన్న 4,077 రోజుల మైలురాయిని మోదీ ఇప్పుడు అధిగమించారు. దీంతో, భారతదేశానికి ఒకేసారి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వారిలో నరేంద్ర మోదీ ఇప్పుడు టాప్ 2 ప్లేస్‌లో ఉన్నారు. ఈ అద్భుతమైన లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ(Nehru) ఉన్నారు.

2014, మే 26న మొదటిసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఛార్జ్ తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని గెలిపించారు. వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీని విజయపథంలో నడిపించిన అసాధారణ ఘనత ఇప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ, నరేంద్ర మోదీలకు మాత్రమే దక్కింది. ఇది భారత రాజకీయాల్లో ఒక అరుదైన, చిరస్మరణీయమైన సందర్భం.

ప్రధాని మోదీ సక్సెస్ గ్రాఫ్ ఇక్కడితో ఆగిపోలేదు. స్వాతంత్య్రం తర్వాత పుట్టి, ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన నాన్-కాంగ్రెస్ లీడర్‌గా కూడా ఆయన కొత్త హిస్టరీ రాశారు. అంతేకాకుండా, లోక్‌సభలో రెండుసార్లు భారీ మెజారిటీతో పవర్‌లోకి వచ్చిన కాంగ్రెస్ కాని పార్టీ నేతగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఇందిరా గాంధీ 1971 ఎన్నికల్లో సాధించిన సూపర్ మెజారిటీ తర్వాత, అత్యధిక మెజారిటీతో పవర్‌లోకి వచ్చిన ప్రధానిగా మోదీ నిలిచారు. ఇది ఆయన తిరుగులేని లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని, ప్రజల్లో ఆయనకున్న అఖండమైన ఆదరణను ప్రూవ్ చేస్తుంది.

నరేంద్ర మోదీ రాజకీయ ప్రయాణం కేవలం ప్రధానమంత్రి పదవికే కాదు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కలిపి సుదీర్ఘ కాలం పాలన సాగించిన నేతగా కూడా ఆయనకు ఒక ప్రత్యేక క్రెడిట్ దక్కింది. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు తీసుకున్న మోదీ, 2014లో ప్రధాని అయ్యేవరకు ఆ పోస్ట్‌లో ఎక్కడా బ్రేక్ లేకుండా కంటిన్యూ అయ్యారు. అప్పటి నుంచి దేశ ప్రధానిగా బాధ్యతలు చూస్తున్నారు.

గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు, 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విన్ అయ్యేలా చేశారు. ఆ తర్వాత నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంటరై, 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని క్యాండిడేట్‌గా బీజేపీని సెంటర్‌లో పవర్‌లోకి తీసుకొచ్చారు. ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో, దేశంలో సీఎంలు, ప్రధానమంత్రులందరిలోనూ వరుసగా ఆరు ఎన్నికల్లో ఒక పార్టీకి లీడ్‌గా గెలిచిన ఏకైక నేతగా నరేంద్ర మోదీ రికార్డు సాధించారు. ఆయన పొలిటికల్ జర్నీ, విజయాలు భారత డెమోక్రసీ హిస్టరీలో ఒక గోల్డెన్ చాప్టర్‌గా నిలుస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button