Just SportsLatest News

India vs Australia 2nd ODI:అడిలైడ్ లోనూ ఓటమే… ఆస్ట్రేలియాదే వన్డే సిరీస్

India vs Australia 2nd ODI: చివర్లో భారత్ వరుస వికెట్లు తీసినప్పటకీ కన్నోలీ క్రీజులో ఉండడంతో ఆసీస్ మరో 3.4 ఓవర్లు మిగిలుండగానే గెలిచింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకుంది.

India vs Australia 2nd ODI

కెప్టెన్ గా శుభమన్ గిల్ తొలి సిరీస్(India vs Australia) ఓటమిని ఖాతాలో వేసుకున్నాడు. ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోయింది. మరో మ్యాచ్ మిగిలుండగానే ఆసీస్ సిరీస్ కైవసం చేసుకుంది. అడిలైడ్(Adelaide) వేదికగా జరిగిన రెండో వన్డేలో కంగారూలు 2 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్ (India vs Australia) లో భారత్ మంచి స్కోరే చేసినా.. బౌలర్లు చివరి వరకూ పోరాడినప్పటకీ ఫలితం లేకపోయింది.

కుల్దీప్ యాదవ్ లేకపోవడం మరోసారి మన ఓటమికి కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుది జట్టు ఎలాంటి మార్పులు చేయకపోవడంతో కుల్దీప్ మళ్ళీ బెంచ్ కే పరిమితమయ్యాడు. తొలి వన్డే తరహాలోనే భారత్ కు సరైన ఆరంభం దక్కలేదు. గిల్ నిరాశ పరిస్తే.. కోహ్లీ కనీసం ఖాతా కూడా తెరవకుండానే ఔటయ్యాడు. ఫలితంగా భారత్ 17 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ కీలక పార్టనర్ షిప్ తో ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 118 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్ వన్డేల్లో తన 59 హాఫ్ సెంచరీని పూక్తి చేసుకోగా.. శ్రైయాస్ అయ్యర్ కూడా అర్థసెంచరీ సాధించాడు.

India vs Australia 2nd ODI
India vs Australia 2nd ODI

అయితే వీరిద్దరూ వెంటవెంటనే ఔటవడం… రాహుల్, నితీశ్ రెడ్డి కూడా నిరాశపరచడంతో భారత్ స్కోర్ 250 లోపే ఉంటుందనిపించింది. కానీ చివర్లో అక్షర్ పటేల్ తో పాటు హర్షిత్ రాణా మెరుపులు మెరిపించారు. అక్షర్ పటేల్ 44 రన్స్ చేయగా….హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ 37 పరుగుల పార్టనర్ షిప్ తో భారత్ స్కోర్ 264కు చేరగలిగింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లతో భారత్ ను దెబ్బకొట్టాడు. బార్టోలిట్ 3 , స్టార్క్ 2 వికెట్లు తీశారు.

ఛేజింగ్ లో ఆస్ట్రేలియా కూడా తడబడింది. త్వరగానే మిఛెల్ మార్ష్ , హెడ్ వికెట్లను చేజార్చుకుంది. అయితే మాథ్యూ షార్ట్ , రెన్షా పార్టనర్ షిప్ ఆసీస్ కు కీలకంగా మారింది. రెన్షా ఔటైనప్పటకీ.. షార్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. అలెక్స్ క్యారీ కూడా నిరాశపరిచినా… కూపర్ కన్నోలీ అద్భుతమైవ హాఫ్ సెంచరీతో ఆసీస్ ను గెలిపించాడు.

చివర్లో భారత్ వరుస వికెట్లు తీసినప్పటకీ కన్నోలీ క్రీజులో ఉండడంతో ఆసీస్ మరో 3.4 ఓవర్లు మిగిలుండగానే గెలిచింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకుంది. జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. సిరీస్ లో చివరి వన్డే శనివారం సిడ్నీ వేదికగా జరుగుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

One Comment

  1. 尖端资源,价值百万,一网打尽,瞬间拥有!多重收益,五五倍增,八级提成,后劲无穷!摸币网,最嚣张的上线替下线赚钱网站:https://1925.mobi/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button