ICC : ఇదేమైనా గల్లీ టోర్నీనా ?..పాక్ బోర్డుకు ఐసీసీ వార్నింగ్
ICC : బంగ్లాదేశ్ తో భారత్ వివాదంలో తలదూర్చి ఓవరాక్షన్ చేస్తున్న పాకిస్థాన్ వరల్డ్ కప్ పై తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
ICC
బంగ్లాదేశ్ తో భారత్ వివాదంలో తలదూర్చి ఓవరాక్షన్ చేస్తున్న పాకిస్థాన్ వరల్డ్ కప్ పై తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. తమ ప్రభుత్వ ఆదేశాలతో భారత్ తో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. అయితే పాక్ క్రికెట్ బోర్డు తీరుపై ఐసీసీ మండిపడింది. మీ ఇష్టమొచ్చినట్టు నచ్చిన మ్యాచ్ లు ఆడి, మిగిలిన మ్యాచ్ లు ఆడకుండా వ్యవహరించేందుకు ఇదేమైనా గల్లీ టోర్నమెంట్ అనుకుంటున్నారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాకిస్తాన్ బోర్డు నుంచి భారత్ తో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లుగా తమకు ఎలాంటి మెయిల్ లేదా లేఖ అందలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆధారంగానే ఐసీసీ దీనిపై స్పందించినట్టు తెలుస్తోంది. ఐసీసీ(ICC) క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. వీటిని ఉల్లంఘిస్తూ పాక్ ప్రభుత్వం నేరుగా ప్రకటన చేయడం మరింత వివాదాస్పదమైంది. దీంతో పాక్ ప్రభుత్వంతో పాటు పాక్ క్రికెట్ బోర్డుపైనా ఐసీసీ ఫైర్ అయింది. భారత్ తో మ్యాచ్ బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్దమని, ఇది పాకిస్థాన్ క్రికెట్‌కు ఏ మాత్రం మంచిది కాదని వార్నింగ్ ఇచ్చింది. దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఐసీసీ పాక్ అధికారిక సమాచారం కోసం వేచి చూస్తోంది. ప్రపంచకప్ లాంటి టోర్నీలో ఎంపిక చేసిన మ్యాచ్ లలో ఆడడం అనే వైఖరి ఏ జట్టుకూ ఆమోదయోగ్యం కాదని ఐసీసీ స్పష్టం చేసింది.కాగా. పాకిస్థాన్.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. 2010 తర్వాత..చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరగని తొలి ఐసీసీ టోర్నీగా 2026 టీ20 ప్రపంచకప్ నిలవనుంది. మరోవైపు భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ చేస్తే పాక్ జట్టుకే ఎక్కువ నష్టం.

టోర్నీలో రెండు పాయింట్లు కోల్పోవడంతో పాటు తమ తర్వాతి రౌండ్ అవకాశాలను తామే ప్రభావితం చేసుకున్నట్టవుతుంది. అలాగే బ్రాడ్ కాస్టర్లకు, స్పాన్సర్లకు పాక్ బోర్డు సమాధానం చెప్పడమే కాదు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్ , పాక్ మ్యాచ్ కు సంబంధించిన ప్రసార హక్కులు, వాణిజ్య ప్రకటనలు, టికెట్ల అమ్మకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఒక్క మ్యాచ్ ద్వారా ఏకంగా 350 కోట్ల ఆదాయం వరకూ రానుంది.
ఇప్పుడు పాక్ జట్టు అత్యుత్సాహంతో మ్యాచ్ ను బహిష్కరిస్తే ఆ మొత్తం పీసీబీనే చెల్లించాల్సి ఉంటుంది. ఐసీసీ(ICC) ద్వారా పాక్ జట్టుకు వచ్చే రెవెన్యూలో ఈ మొత్తాన్ని మినహాయించుకోనున్నారు. ఆర్థిక పరంగానూ పాక్ బోర్డుకు ఈ నిర్ణయం చాలా నష్టం చేయబోతోంది. బంగ్లాదేశ్ మ్యాచ్ లు వేదిక మార్చనందుకు ఆ దేశం టోర్నీ నుంచి తప్పుకోగా.. తమకు సంబంధం లేకున్నా పాక్ బోర్డు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఓవరాక్షన్ చేస్తోంది.
Gold and Silver:బంగారం ప్రియులకు బొనాంజా.. కుప్పకూలిన పసిడి, వెండి ధరలు




One Comment