Lord Hanuman:మంగళవారం మారుతి స్మరణం.. ఆరోజు అంజన్నకు ఏం చేయాలి?
Lord Hanuman:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ దోషం ఉన్నవారు, మానసిక ఆందోళనలతో సతమతమవుతున్న వారు మంగళవారం రోజు ఆంజనేయస్వామిని ఆరాధించాలి.
Lord Hanuman
మంగళవారం అంటే మంగళప్రదాయకుడు, సంకట మోచనుడు అయిన హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ దోషం ఉన్నవారు, మానసిక ఆందోళనలతో సతమతమవుతున్న వారు మంగళవారం రోజు అంజన్నను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయస్వామి ఆరాధన మన జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో ఓసారి చూద్దాం.
హనుమంతుడు(Lord Hanuman) కేవలం రామబంటు, శక్తి స్వరూపమే కాదు.. అపారమైన విజ్ఞాన గని. రావణాసురుడు సీతాదేవిని అపహరించినపుడు.. సీతమ్మ జాడను కనిపెట్టడంలో హనుమయ్య చూపిన యుక్తి, అలాగే.. లంకా దహనంలో చూపిన పరాక్రమం, సంజీవని పర్వతాన్ని తెచ్చిన వేగం.. ఇవన్నీ మనకు జీవితంలో వచ్చే అడ్డంకులను ఎలా అధిగమించాలో నేర్పుతాయి. అంతేకాదు రామ నామం జపించే చోట హనుమంతుడు అదృశ్య రూపంలో ఉండి మనల్ని రక్షిస్తాడని పెద్దలు చెబుతారు.
మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి సింధూర అలంకారం చేసి ఆ సింధూరాన్ని మన నుదిటిన పెట్టుకోవడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆంజనేయస్వామికి తమలపాకుల పూజ కానీ తమలపాకుల మాల అన్నా చాలా ఇష్టం. తమలపాకు శాంతికి చిహ్నం అని పురాణాలు చెబుతాయి. ఇది మనసులోని చంచలత్వాన్ని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే స్వామికి వడమాల సమర్పించడం వెనుక .. మనలోని కఠినత్వాన్ని (వడలాగా) స్వామికి సమర్పించి మెత్తని మనసును పొందడం అని అర్ధం.

ప్రతిరోజూ, ముఖ్యంగా మంగళవారం హనుమాన్ చాలీసాను ఏడు సార్లు పఠించడం వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వలయం ఏర్పడుతుంది. భయం, నెగటివ్ ఆలోచనలు, పీడకలలు వచ్చే వారికి ఇది ఒక దివ్యౌషధం. “సంకట కటే మిటే సబ్ పీరా.. జో సుమిరై హనుమత్ బలబీరా అని స్మరించాలి. అంటే స్మరిస్తే సమస్త కష్టాలు, బాధలు తొలగిపోతాయని అంతరార్థం.
ఆంజనేయుడి నుండి మనం నేర్చుకోవాల్సినవి.ఎంత శక్తి ఉన్నా రాముడి ముందు దాసుడిగా ఉండటం. అంటే వినయంగా ఉండాలి అని అర్ధం. అలాగే కార్యదక్షత కూడా నేర్చుకోవాలి అప్పగించిన పనిని ప్రాణం పణంగా పెట్టి అయినా పూర్తి చేయడం అన్నమాట. అంతేకాదు బ్రహ్మచారి అయిన హనుమంతుడి (Lord Hanuman) జీవితం.. ఇంద్రియ నిగ్రహం ద్వారా మన లక్ష్యాలను ఎలా చేరుకోవాలో చెబుతుంది.
Tilak Varma : వార్మప్ లో తిలక్ వర్మ అదుర్స్..యూఎస్ఏపై భారత్ ఏ విక్టరీ



