IPO :ఐపీఓలలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఈ 3 విషయాలు చూడండి
IPO : ప్రతి ఐపీఓ లాభాలు ఇస్తుందని చెప్పలేం. అందుకే పెట్టుబడి పెట్టే ముందు ఓ మూడు విషయాలను కచ్చితంగా పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు.
IPO
స్టాక్ మార్కెట్లో కొత్తగా అడుగుపెట్టే వాళ్లకు..ఐపీఓ (Initial Public Offering) అనేది ఒక అద్భుతమైన అవకాశంలా కనిపిస్తుంది. ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ మొదటిసారిగా ప్రజల నుంచి నిధులు సేకరించడానికి షేర్ మార్కెట్లోకి రావడాన్నే ఐపీఓ( IPO ) అంటారు. అయితే, అలా మార్కెట్లోకి వస్తున్న ప్రతి ఐపీఓ లాభాలు ఇస్తుందని చెప్పలేం. అందుకే పెట్టుబడి పెట్టే ముందు ఓ మూడు విషయాలను కచ్చితంగా పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు.
కంపెనీ ఆర్థిక గమనం (Financial Background).. కేవలం ప్రకటనలు చూసి కాకుండా, కంపెనీ తాలూకా మూడు నుంచి ఐదేళ్ల ఆర్థిక నివేదికలను పరిశీలించాలి. కంపెనీ అమ్మకాలు పెరుగుతున్నాయా? నికర లాభం ఎంతుంది? ఒకవేళ నష్టాల్లో ఉన్న కంపెనీ అయితే, ఆ నష్టాలు తగ్గుతూ వస్తున్నాయా లేదా అనేది చూడాలి. స్థిరమైన లాభాలు ఉన్న కంపెనీలో పెట్టుబడి పెట్టడం ఎప్పుడూ మంచిది.
నిధుల వినియోగం (Object of the Issue).. ప్రజల నుంచి తీసుకుంటున్న వేల కోట్ల రూపాయలను ఆ కంపెనీ ఏం చేయబోతోంది? అనేది చాలా ముఖ్యం. ఒకవేళ కానీ కంపెనీ తన పాత అప్పులు తీర్చడానికి ఈ నిధులు వాడుతుంటే మాత్రం, దానివల్ల భవిష్యత్తులో వృద్ధి తక్కువగా ఉండొచ్చు. అలా కాకుండా కొత్త బ్రాంచ్లు తెరవడానికి, టెక్నాలజీని పెంచుకోవడానికి లేదా వ్యాపార విస్తరణకు వాడుతుంటే ఆ కంపెనీ షేర్ విలువ పెరిగే అవకాశముంటుంది.

గ్రే మార్కెట్ ప్రీమియం, వాల్యుయేషన్ (GMP & Valuation).. కంపెనీ షేర్ ధర మార్కెట్ ధరలోనే ఉందో లేదో చూడాలి. తోటి కంపెనీలతో పోలిస్తే ఇది మరీ ఎక్కువ ధరకు షేర్లను అమ్ముతుంటే మాత్రం జాగ్రత్త పడాలి. అలాగే ‘గ్రే మార్కెట్ ప్రీమియం’ (GMP) ద్వారా.. ఆ వచ్చిన ఐపీఓ పట్ల బయట మార్కెట్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలుస్తుంది. ఈ మూడింటిని బేరీజు వేసుకుని అడుగు వేస్తే, స్టాక్ మార్కెట్లో నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.
T20 World Cup : తుది జట్టు కూర్పుకు చివరి ఛాన్స్..భారత్ , సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్



