Just BusinessLatest News

Gold rates:బంగారం మళ్లీ పైకి..బంగారం కొనొచ్చా ..వెయిట్ చేయాలా?

Gold rates: డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గుతాయని అంతా అనుకుంటారు, కానీ భారత్ లాంటి దేశాల్లో డిమాండ్ మళ్లీ పెరగడం వల్ల ధరలు పైకి ఎగబాకాయి.

Gold rates

వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ ఉండటంతో, ఇక పసిడి పతనం మొదలైందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, బుధవారం నాటి పరిస్థితులు చూస్తుంటే బంగారం మళ్లీ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. ఈ ధరలు మళ్లీ పెరగడం వెనుక బలమైన అంతర్జాతీయ కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

నిజానికి బడ్జెట్ తర్వాత బంగారం ధరలు( Gold rates) భారీగానే తగ్గాయి. మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒక కీలక ట్రేడ్ డీల్ మార్కెట్ సమీకరణాలను మార్చేసినట్లు తెలుస్తోంది.

అమెరికా భారత్ పై విధించిన టారిఫ్ లను తగ్గించడంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చాయి. సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద ఒప్పందాలు జరిగినప్పుడు, కరెన్సీ మార్కెట్ లో డాలర్ బలపడుతుంది. డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గుతాయని అంతా అనుకుంటారు, కానీ భారత్ లాంటి దేశాల్లో డిమాండ్ మళ్లీ పెరగడం వల్ల ధరలు పైకి ఎగబాకాయి.

ధరలు తగ్గగానే అప్పటివరకు వేచి చూసిన సామాన్యులు, ఇన్వెస్టర్లు ఒక్కసారిగా కొనుగోళ్లు వైపు ఆసక్తి చూపించారు. డిమాండ్ పెరగడం వల్ల రేట్లు మళ్లీ పెరిగాయి.

షేర్ మార్కెట్లో ఏదైనా వస్తువు ధర ఇలా విపరీతంగా పడిపోయినప్పుడు, దాన్ని కరెక్షన్ అంటారు. ఆ పతనం తర్వాత మళ్లీ కొంత వరకూ పెరగడం అనేది మార్కెట్ లో ఒక సహజమైన ప్రక్రియ. ఇప్పుడు బంగారం విషయంలోనూ అదే జరిగింది.

ఇప్పుడు ఫిబ్రవరి మాఘమాసం కావడంతో దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి కూడా ఉంది. దీనివల్ల ఫిజికల్ గోల్డ్ కు విపరీతమైన గిరాకీ పెరిగినట్లు ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు

హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ. 1,53,940 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇది స్వల్ప పెరుగుదల. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,41,110 గా కొనసాగుతుంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ. 1,54,090 కు చేరుకుంది. అన్నీ చోట్లా సగటున రూ. 10 రూ. 100 వరకు పెరుగుదల కనిపిస్తోంది.

Gold and Silver
Gold and Silver

వెండి విషయంలో మాత్రం వినియోగదారులకు కొంత ఊరటే లభించింది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర స్వల్పంగా తగ్గి రూ. 2,99,900 కు చేరింది. నిన్నటి వరకు ఇది రూ. 3 లక్షల మార్కు వద్ద ఉండేది.

బంగారం ధరలు ( Gold rates)ఇంకా తగ్గుతాయని భావించిన పసిడి కొనుగోలుదారులు.. ప్రస్తుత పెరుగుదలను గమనించి ఆచితూచి అడుగు వేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల రేట్లు మళ్లీ మారే అవకాశం ఉంటుందంటున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button