HealthLatest News

Lack Of Protein : ప్రోటీన్ తక్కువైతే శరీరంలో ఏం జరుగుతుంది? మీ బాడీ ఈ సైలెంట్ సిగ్నల్స్ ఇవే..

Lack Of Protein : ప్రోటీన్ లోపించివారిలో విపరీతమైన నీరసం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Lack Of Protein

మన బాడీ స్ట్రక్చర్, రోజువారీ నిర్వహణలో ప్రోటీన్ రోల్ చాలా కీలకమైనది. మజిల్ స్టిఫ్‌నెస్ పెంచడం, ఇమ్యూన్ సిస్టంను స్ట్రాంగ్ చేయడం, టిష్యూ రిపేర్ మెటబాలిజమ్‌ (Metabolism) క్రమబద్ధీకరించడం వంటి అనేక ముఖ్యమైన పనులకు ప్రోటీన్ కానిస్టెంట్‌గా అవసరం. మన రోజువారీ ఫుడ్‌లో తగినంత ప్రోటీన్ లేకపోతే(Lack Of Protein) బాడీలో చాలా రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడే డేంజర్ ఉంది.

అయితే, ఈ లోపాన్ని బాడీ ముందే కొన్ని ప్రారంభ సంకేతాల ద్వారా వార్నింగ్ ఇస్తుంది. ఈ లక్షణాలను స్టార్టింగ్ స్టేజ్‌లోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫ్యూచర్‌లో వచ్చే పెద్ద పెద్ద అనారోగ్యాల నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రోటీన్ లోపం(Lack Of Protein) వల్ల బాడీలో కనిపించే మెయిన్ లక్షణాలను పరిశీలిస్తే, మొదటగా కండరాల బలహీనత, నొప్పులు కనిపిస్తాయి. బాడీకి తగినంత ప్రోటీన్ అందనప్పుడు, తన ఎమర్జెన్సీ డ్యూటీ కోసం బాడీ కండరాలలోని కణజాలాన్ని విచ్ఛిన్నం చేసి అమైనో ఆమ్లాలను గ్రహించడం స్టార్ట్ చేస్తుంది. దీని వల్ల మజిల్స్ మెల్లగా బలహీనపడటంతోమ పాటు వాటి సైజ్ తగ్గిపోతుంది. ఎప్పుడూ నీరసంగా అనిపించడం, కొద్దిపాటి పనికే తీవ్రమైన మజిల్స్ నొప్పులు రావడం దీనికి ముఖ్యమైన సూచికలు.

అలాగే జుట్టు, చర్మం, గోళ్ల సమస్యలు. మనందరి జుట్టు, గోళ్లు, చర్మం హెల్దీగా, షైనింగ్‌గా ఉండటానికి కెరాటిన్, కొల్లాజెన్ వంటి ప్రోటీన్లు చాలా అవసరం. ప్రోటీన్ లోపం ఏర్పడితే ఈ నిర్మాణాలన్నీ దెబ్బతిని బలహీనపడతాయి. దాంతో హెయిర్ ఫాల్ విపరీతంగా పెరగడం, జుట్టు పొడిబారి నిర్జీవంగా మారడం, గోళ్లు పెళుసుగా మారి విరిగిపోవడం, స్కిన్ డల్‌గా అయి పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

అంతేకాకుండా ప్రోటీన్ లోపం వల్ల రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. బాడీలో వ్యాధికారక క్రిములు, ఇన్ఫెక్షన్లతో పోరాడే యాంటీబాడీలు ప్రొడ్యూస్ అవడానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లెవల్స్ తగ్గితే ఇమ్యూన్ సిస్టం క్షీణించి, తరచూ జలుబు, జ్వరం వంటి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. అలాగే, దెబ్బలు తగిలినప్పుడు గాయాలు మానడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తి కూడా మందగించడంతో.. గాయాలు త్వరగా మానవు.

ఇంకో ముఖ్యమైన లక్షణం తీవ్రమైన ఆకలితో పాటు కాళ్లు, ముఖం వాపులు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు కడుపు నిండిన ఫీల్ ఎక్కువ సమయం ఉంటుంది. ఫుడ్‌లో ప్రోటీన్ లోపించినప్పుడు, జీర్ణవ్యవస్థ త్వరగా ఖాళీ అయిపోవడంతో ఎంత తిన్నా కూడా ఆకలి వేస్తుంది.

ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, స్వీట్స్ తినాలనే కోరిక విపరీతంగా పెరుగుతుంది. మరోవైపు, రక్తంలో అల్బుమిన్ వంటి ప్రోటీన్ల లెవెల్ తగ్గడం వల్ల బాడీ లిక్విడ్స్‌ను సరిగ్గా బ్యాలెన్స్ చేయలేదు. దీని వల్ల కాళ్లు, చీలమండలాలు, ఫేస్ వంటి భాగాల్లో వాటర్ చేరి వాపులు వస్తాయి.

అలాగే ప్రోటీన్ లోపించివారిలో విపరీతమైన నీరసం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్రెయిన్‌లోని న్యూరోట్రాన్స్‌మీటర్ల సంశ్లేషణకు అమైనో యాసిడ్స్ చాలా అవసరం. ప్రోటీన్ లోపం వల్ల వీటి పనితీరు దెబ్బతిని విపరీతమైన అలసట, బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడం (Brain fog), ఏకాగ్రత కుదరకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Lack Of Protein
Lack Of Protein

ఈ లోపాన్ని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే ఫ్యాటీ లివర్, ఎముకల సాంద్రత తగ్గిపోవడం (Osteoporosis) వంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల్లో ఈ లోపం ఉంటే వారి ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ దారుణంగా మందగిస్తుంది.

ఈ లక్షణాలు ప్రోటీన్ లోపమే కాకుండా ఇతర పోషకాహార లోపాలు, ఇతర రుగ్మతల వల్ల కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ లక్షణాలు ఎక్కువ కాలం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Appreciation : మనసులోని మెచ్చుకోలును దాచుకోకండి..ఎదుటివారిలో కాన్ఫిడెన్స్ నింపండి..

Related Articles

Back to top button