Just InternationalJust NationalJust PoliticalLatest News

Dalai Lama :ఎప్‌స్టీన్‌ వివాదంలో దలైలామా పాత్ర ఎంత? ఆధ్యాత్మిక గురువు కార్యాలయం ప్రకటనలో ఏముంది?

Dalai Lama :జెఫ్రీ ఎప్‌స్టీన్ నిర్వహించిన హై-ప్రొఫైల్ పార్టీలకు ఎవరెవరు వెళ్లారనే అంశంపై ..అమెరికా న్యాయశాఖ రిలీజ్ చేస్తున్న లక్షలాది ఇమెయిల్స్, ఫోటోలు ఇప్పుడు కీలకంగా మారాయి.

Dalai Lama

అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన లైంగిక నేరస్థుడు, మానవ అక్రమ రవాణాదారుగా ముద్రపడిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన రహస్య పత్రాలను (Epstein Files) అమెరికా న్యాయశాఖ రిలీజ్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ పేపర్స్‌లో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, పొలిటికల్ లీడర్స్, హాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు బయటపడుతున్నాయి. అయితే, ఈ జాబితాలో టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా( Dalai Lama ) పేరు కూడా వందకు పైగా సార్లు ప్రస్తావనకు రావడంతో..ప్రపంచం షాక్ అయింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించడంతో.. ఈ వివాదంపై దలైలామా కార్యాలయం ఇప్పుడు అధికారికంగా రియాక్టయింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని దలైలామా( Dalai Lama ) కార్యాలయం ఎప్‌స్టీన్‌ ఫైల్‌లోని ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. 14వ దలైలామా.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను తన జీవితంలో ఎప్పుడూ కలవలేదని చెప్పింది. దలైలామాతో మాట్లాడటానికి కానీ ఆయన తరపున ఎవరినైనా సంప్రదించడానికి కానీ ఎవరికీ అనుమతి ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అలాగే తప్పుదారి పట్టించేవని పత్రికా ప్రకటనలో చెప్పింది. ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌తో దలైలామాకు ఎటువంటి సంబంధం లేదని ధృవీకరించింది.దలైలామా పేరును కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఈ వివాదంతో ముడిపెడుతున్నారని కార్యాలయం ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మొదటి నుంచి కూడా దూకుడుగా స్పందిస్తున్నారు. గతంలోనే మస్క్ ఈ పత్రాలను బహిర్గతం చేయాలని గట్టిగా డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ లిస్టులో తన పేరు కూడా ఉందని జరుగుతున్న ప్రచారానికి మస్క్ తన స్టైల్‌లో సమాధానమిచ్చారు. తనకు ఎప్‌స్టీన్‌తో ఎటువంటి సంబంధం లేదని, తాను అతడిని ఎప్పుడూ కలవలేదని..తన పేరు ఇందులో ఉండటం అసంభవమని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఎప్‌స్టీన్ కస్టమర్ల లిస్టును ట్రంప్ ప్రభుత్వం ఎందుకు పూర్తిగా బయటపెట్టడం లేదో ఆశ్చర్యంగా ఉందంటూ అమెరికా వ్యవస్థలపైనే సెటైర్లు వేశారు.

Dalai Lama
Dalai Lama

కాగా జెఫ్రీ ఎప్‌స్టీన్ నిర్వహించిన హై-ప్రొఫైల్ పార్టీలకు ఎవరెవరు వెళ్లారనే అంశంపై ..అమెరికా న్యాయశాఖ రిలీజ్ చేస్తున్న లక్షలాది ఇమెయిల్స్, ఫోటోలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఇప్పటికే ఈ లిస్టులో స్టీఫెన్ హాకింగ్, డోనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్ వంటి వారి బడా సెలబ్రెటీల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ కూడా తన విడాకులకు ఎప్‌స్టీన్‌తో బిల్ గేట్స్‌కు ఉన్న సంబంధమే ఒక కారణమని వెల్లడించారు. తాజాగా బిల్ గేట్స్ కూడా ఈ విషయంలో వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే.

దలైలామా వంటి ఆధ్యాత్మిక వేత్త పేరు కూడా దీనిలో రావడం అనేది కేవలం దుష్ప్రచారమని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నా.. ఈ ఫైల్స్ వెల్లడిస్తున్న వాస్తవాలు రాబోయే రోజుల్లో ఇంకెన్ని దేశాల రాజకీయాలను ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి అన్న వారు పెరుగుతున్నారు.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button