Komati Reddy : అన్న అలా..తమ్ముడు ఇలా..కోమటి రెడ్డి బ్రదర్స్ – కన్ఫ్యూజన్ పాలిటిక్స్
Komati Reddy : కోమటిరెడ్డి బ్రదర్స్ గేమ్ ప్లాన్ ఏంటి?

Komati Reddy
రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం మళ్లీ కావాల్సిందే అంటూ అన్న పూజలు చేస్తాడు. అదే సమయంలో ఈ సీఎం వ్యాఖ్యలు అసహనంగా ఉన్నాయి అంటూ తమ్ముడు సోషల్ మీడియాలో విరుచుకుపడతాడు. రాజకీయాల్లో అన్నదమ్ముల డిఫరెంట్ ట్రాక్ చూసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఒక్కసారి ఆశ్చర్యపోతున్నారు.
నల్గొండలో క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమిపూజ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటల్లో రేవంత్ రెడ్డిపై భక్తి, లాయల్టీ బయటపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందిస్తే, మీరు మళ్లీ సీఎం అవ్వాలని ప్రత్యేక పూజ చేశా సార్ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ టోన్ మొత్తం పాలిటికల్ లాయల్టీకే అద్దం పడుతుందన్న కామెంట్లు వినిపించాయి.

కానీ అదే సమయంలో తమ్ముడు కోమటిరెడ్డి (Komati Reddy)రాజగోపాల్ రెడ్డి మాత్రం సీఎం వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా ఎండగట్టారు. ముఖ్యమంత్రి సోషల్ మీడియా గురించి వేసిన మాటలపై డైరెక్ట్‌గా ఎక్స్‌లో స్పందించి,ఇది విభజించి పాలించే రాజకీయాలే అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. అప్పుడే కాదు వీలు అయినప్పుడల్లా వీలు కుదుర్చుకుని మాటల దాడికి దిగుతూనే ఉంటాడు.

తాజాగా మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి (Komati Reddy)రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పినా కూడా తన ప్రజల కోసం మునుగోడు నుంచే పోటీ చేసి గెలిచానని స్పష్టం చేశారు. మంత్రి పదవి వస్తే అది తనకు కాదని, తన ప్రజలకే ఉపయోగపడుతుందని అన్నారు. పదవి కోసం ఎవరి కాళ్లూ పట్టుకోనని, అవసరమైతే గతంలోలాగే ప్రభుత్వాన్ని మొత్తం మునుగోడుకు తీసుకువస్తానని ఘాటు కామెంట్లు చేశారు.
ఇక ఇప్పుడు ప్రశ్న ఒకటే…కోమటిరెడ్డి (Komati Reddy)అన్నదమ్ములు ఇద్దరూ కాంగ్రెస్‌లోనే ఉన్నా..ఇద్దరికీ ఉన్న స్ట్రాటజీ వేరు. అన్న అనుక్షణం సీఎం కోసం తాపత్రాయ పడుతూ ఉంటే, తమ్ముడు పార్టీపై ఒత్తిడి తెచ్చే విమర్శల ట్రాక్‌లో నడుస్తున్నాడు.ఇక… రేవంత్ రెడ్డి ఈ అన్నదమ్ముల ఆంతర సంగతుల్ని ఎలా చూడబోతున్నారు? మరి ఇది కుటుంబ వ్యవహారమా, రాజకీయ వ్యూహమా అన్నది తెలియాలి అంటే.. ఇంకొన్ని రోజులు గడపాల్సిందే!
Also read: Local identity: రెండేళ్లు బయట చదివితే స్థానికత పోతుందా?